సినిమా విడుదలకు ముందే దర్శకుడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన మారుతి (Director Maruthi)

Updated on Oct 15, 2022 04:10 PM IST
మూవీ రిలీజ్‌కు ముందే డైరెక్టర్ సాయి రాజేష్ (Sai Rajesh)కు నిర్మాతలు కాస్ట్‌లీ కారును బహుమతిగా అందించారు
మూవీ రిలీజ్‌కు ముందే డైరెక్టర్ సాయి రాజేష్ (Sai Rajesh)కు నిర్మాతలు కాస్ట్‌లీ కారును బహుమతిగా అందించారు

సినిమాలు రిలీజై విజయవంతమైతే హీరోలు, దర్శకులకు నిర్మాతలు బహుమతులు ఇవ్వడాన్ని చూస్తుంటాం. చిత్రం ఎక్కువ లాభాలు తెచ్చిపెడితే వారికి ఖరీదైన కార్లు, గిఫ్టులు ఇస్తుంటారు. కానీ మూవీ రిలీజ్‌కు ముందే గిఫ్టులు ఇవ్వడం అరుదుగా జరిగే విషయమనే చెప్పాలి. తాజాగా నేషనల్ అవార్డ్ విన్నర్ డైరెక్టర్ సాయి రాజేష్ (Sai Rajesh) విషయంలో ఇదే జరిగింది. ఆయన దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘బేబీ’ (Baby). ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 

ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా నటిస్తున్న ‘బేబీ’ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్‌కేఎన్‌తో కలసి ప్రముఖ డైరెక్టర్ మారుతి (Director Maruthi) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవీ చైతన్య ఈ సినిమాలో కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ప్రేమ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను త్వరలో థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

తాజాగా ‘బేబీ’ మూవీ రషెస్ చూసిన నిర్మాతలు ఎస్‌కేఎన్, మారుతి.. సాయి రాజేష్ టేకింగ్ కు ఫిదా అయ్యారట. ఆయన తెరకెక్కించిన విధానం బాగుండటంతో సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యారట. దీంతో చిత్ర దర్శకుడు సాయి రాజేష్‌కు విడుదలకు ముందే ఖరీదైన ‘ఎంజీ హెక్టార్’ కారును బహుమతిగా అందించారు. దీన్ని బట్టి ఈ సినిమా సక్సెస్ మీద నిర్మాతలు ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థమవుతుంది. 

కాగా, తనకు కారును గిఫ్టుగా ఇచ్చిన నిర్మాతల గురించి సాయి రాజేష్ కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘బాగా తీశాననే ఇష్టమో లేదా హిట్‌ కొట్టాల్సిందేనని బ్లాక్‌ మెయిలో తెలియదు. కానీ మా నిర్మాతలు నాకు కారును బహుమతిగా ఇచ్చారు. గురువుగారు మారుతికి, స్నేహితుడు ఎస్‌కేఎన్‌కు థ్యాంక్స్‌’ అని సాయి రాజేష్ ట్వీట్ చేశారు. ‘బేబీ’ టీజర్‌‌ను త్వరలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఇకపోతే, ఈ డైరెక్టర్ సాయి రాజేష్ ఎవరో కాదు.. సంపూర్ణేశ్ బాబుతో ‘హృదయ కాలేయం’ సినిమాను ఈయనే తీశారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న సాయి రాజేష్.. ‘కలర్ ఫోటో’ సినిమాను నిర్మించి.. ప్రొడ్యూసర్ గానూ తన అభిరుచిని చాటారు. ‘కలర్ ఫోటో’ మూవీకి కథను కూడా సాయి రాజేష్‌ అందించడం విశేషం.  

Read more: Prabhas (ప్రభాస్) నటిస్తున్న హారర్ చిత్రం 'రాజా డీలక్స్' పై కొత్త అప్డేట్ ఇదే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!