'వీరసింహారెడ్డి'గా అలరించనున్న నందమూరి బాలకృష్ణ (BalaKrishna).. ఎన్‌బీకే107’ టైటిల్ ఫిక్స్

Updated on Oct 21, 2022 09:34 PM IST
నందమూరి బాలకృష్ణ (BalaKrishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్‌బీకే107 షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది
నందమూరి బాలకృష్ణ (BalaKrishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్‌బీకే107 షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది

అఖండ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ (Balakrishna) - గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో యాక్షన్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్‌బీకే107 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.

పవర్‌‌ఫుల్‌ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాస్ టైటిల్‌ను పెట్టారు. ‘వీరసింహారెడ్డి’  అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు ప్రకటించారు మేకర్స్. సినిమా టైటిల్‌ను కర్నూల్ కొండా రెడ్డి బురుజు వద్ద  శుక్రవారం రాత్రి 8:15 నిమిషాలకు రివీల్ చేశారు. కొండారెడ్డి బురుజు వద్ద.. భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య ఈ టైటిల్ లుక్‌ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. . అంతకుముందే ఈ సినిమా టైటిల్ లీకైంది.

నందమూరి బాలకృష్ణ (BalaKrishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్‌బీకే107 షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది

పవర్‌‌ఫుల్‌ లుక్‌లో..

ఈ పోస్టర్‌లో బాలయ్య పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. 'పులిచర్ల' మైలురాయిపై కాలు పెట్టి నిలుచున్నారు. వెనుక వరుసగా బ్లాక్‌ కలర్ కార్లు వస్తున్నాయి. మైలురాయికి ఆనుకుని ఒక గొడ్డలి ఉన్నాయి. దీంతో సినిమాలో యాక్షన్ సీన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పకనే చెప్తున్నారు డైరెక్టర్. ఈ స్టిల్‌తో సంక్రాంతి పండుగకు మాస్ జాతరేనని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టైటిల్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

బాలకృష్ణ (BalaKrishna) సరసన  శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.  వీరసింహారెడ్డి సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎస్‌ థమన్ వీరసింహారెడ్డి  చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read More : రెమ్యూనరేషన్ పెంచేసిన నందమూరి బాలకృష్ణ (BalaKrishna)!.. అనిల్‌ రావిపూడి సినిమాకి ఎంత తీసుకుంటున్నారంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!