బాల‌కృష్ణ 'ఎన్‌బీకే 107' (NBK 107 ) సినిమా టైటిల్‌ 'జై బాల‌య్య' ఫిక్స్ అయిన‌ట్టేనా!.. ఈ చిత్రం టాప్ 10 విశేషాలు..

Updated on Oct 09, 2022 07:54 PM IST
NBK 107: బాల‌కృష్ణ  (Balakrishna)  న‌టిస్తున్న ఎన్‌బీకే 107కు జై బాల‌య్య అనే టైటిట్ ఫిక్స్ చేస్తార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.
NBK 107: బాల‌కృష్ణ  (Balakrishna) న‌టిస్తున్న ఎన్‌బీకే 107కు జై బాల‌య్య అనే టైటిట్ ఫిక్స్ చేస్తార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

టాలీవుడ్ హీరో నంద‌మూరి  బాల‌కృష్ణ (Balakrishna) అఖండ విజ‌యం త‌రువాత జోష్ మీద ఉన్నారు. త‌న నెక్ట్ సినిమాను మాస్ యాక్ష‌న్ సినిమాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేనితో చేస్తున్నారు. 'ఎన్‌బీకే 107' అనే టెంప‌ర‌రీ టైటిల్‌తో గోపిచంద్ మ‌లినేని శ‌ర వేగంగా సినిమా షూటింగ్ చేస్తున్నారు.

రాయ‌ల‌సీమ క‌థ‌లో బాల‌కృష్ణ‌ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో వెండితెర‌ను షేక్ చేయ‌నున్నారు. ఈ సినిమాను రూ. 70 కోట్ల బ‌డ్జెట్‌తో.. ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బాన‌ర్‌పై నిర్మాత‌లు నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. బాలకృష్ణ న‌టిస్తున్న 'ఎన్‌బీకే 107' సినిమాకు సంబంధించిన టాప్ 10 విశేషాలు పింక్ విల్లా ఫాలోవ‌ర్స్ కోసం. 

NBK 107: బాల‌కృష్ణ  (Balakrishna)  న‌టిస్తున్న ఎన్‌బీకే 107కు జై బాల‌య్య అనే టైటిట్ ఫిక్స్ చేస్తార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

1. సీమ సెంటిమెంట్‌తో బాల‌య్య మూవీ

బాల‌కృష్ణ  (Balakrishna) మ‌రో సారి రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో సాగే క‌థ‌లో న‌టించ‌డం విశేషం. గ‌తంలో రాయ‌ల‌సీమ ఫ్యాక్షన్ నేప‌థ్యంలో బాల‌కృష్ణ‌ 'చెన్న‌కేశ‌వ‌రెడ్డిలో' న‌టించి బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కొట్టారు. 'ఎన్‌బీకే 107'లో కూడా అదే రేంజ్‌లో క‌నిపించేలా ప్లాన్ చేశారు. ఈ సినిమాలో బాల‌కృష్ణ  వీరేంద్ర రెడ్డి పాత్ర‌లో న‌టిస్తున్నారు.

2. స‌త్తా చూపిస్తానంటోన్న డైరెక్ట‌ర్‌

గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం అంటేనే మాస్ యాక్ష‌న్ సినిమాలకు పెట్టింది పేరు.' డాన్ శ్రీను'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ 'బ‌లుపు', 'బాడీగార్డ్‌', 'పండ‌గ చేస్కో', 'విన్న‌ర్', 'క్రాక్' వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించారు. ఈ సినిమాలలో డైలాగులు, హీరోల స‌న్నివేశాలు ఓ రేంజ్‌లో హిట్ అయ్యాయి.

త‌క్కువ సినిమాల‌తోనే పాపుల‌ర్ అయిన గోపిచంద్‌తో బాల‌కృష్ణ త‌న 107 సినిమాను చేస్తున్నారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రిలీజ్ కానున్న‌ 'ఎన్‌బీకే 107'లో సీను సీనుకి థియేట‌ర్లు మోత మోగుతాయ‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  

3. విదేశాల్లో షూటింగ్

ట‌ర్కీలో జ‌రిగిన 'ఎన్‌బీకే 107' షూటింగ్ ఫోటోల‌ను ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపించంద్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ట‌ర్కీలో బాల‌కృష్ణ‌కు సంబంధించిన ఓ ఫైటింగ్ సీన్ కూడా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ వీడియోలో బాల‌కృష్ణ పంచెక‌ట్టులో క‌నిపించ‌డం విశేషం. 

దీనిని బ‌ట్టి చూస్తే .. విదేశాల్లో జ‌రిగే స‌న్నివేశాలు, ఫైట్స్ ఈ సినిమాలో హైలెట్ కానున్నాయ‌ని తెలుస్తోంది. ట‌ర్కీతో పాటు దుబాయ్, ఇస్తాంబుల్ వంటి దేశాల్లో 'ఎన్‌బీకే 107' షూటింగ్ జ‌రిగింది.

4. హీరోయిన్ శ్రుతిహాస‌న్

బాల‌కృష్ణ‌కు జోడిగా శ్రుతి హాస‌న్ న‌టిస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతి హాస‌న్ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. గ్లామ‌ర్ పాత్ర‌లో న‌టించిన శ్రుతి.. ఈ సినిమాలో త‌న న‌ట విశ్వ రూపం చూపించ‌నున్నార‌ట‌. 

5. ఆస్ట్రేలియా సుంద‌రి ఐటం సాంగ్‌

భారతీయ మూలాలు ఉన్న ఆస్ట్రేలియా అమ్మాయి చంద్రికా రవి. మిస్ వ‌ర‌ల్డ్ ఆస్ట్రేలియా, మిస్ ఇండియా ఆస్ట్రేలియా పోటీల్లో ఫైన‌ల్ రౌండ్ వ‌ర‌కు చంద్రికా ర‌వి వెళ్లారు. మెడ‌ల్‌గా, డాన్స‌ర్‌గా పాపుల‌ర్ అయ్యారు.చంద్రిక  తెలుగులో 'చీకటి గదిలో చితక్కొట్టుడు' అనే ఒక సినిమా చేశారు. ప్ర‌స్తుతం బాల‌య్య‌ సినిమాలో ఐటం సాంగ్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నారు. 

6. కీల‌కంగా త‌మిళ న‌టి పాత్ర‌

లేడీ విల‌న్ పాత్ర‌లో  వ‌రల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ న‌టిస్తున్నార‌నే వార్త‌లు ప్ర‌చారంలో ఉన్నాయి. అదే నిజ‌మైతే బాల‌కృష్ణ‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ మ‌ధ్య సాగే స‌న్నివేశాలు థియేట‌ర్ల‌ను షేక్ చేస్తాయి. త‌మిళ్‌తో పాటు వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ తెలుగులోనూ త‌న న‌ట విశ్వ రూపం చూపించనున్నారు. 

7.  బాల‌కృష్ణతో కేర‌ళ భామ

హీరోయిన్ హ‌నీ రోజ్ మ‌ల‌యాళీ భామ‌. ఈమె మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, త‌మిళ‌, తెలుగు చిత్రాల్లో న‌టించారు. తెలుగులో 'ఆల‌యం', 'ఈ వ‌ర్షం సాక్షిగా' చిత్రాల్లో న‌టించారు. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ న‌టిస్తున్న 'ఎన్‌బీకే 107'లో న‌టించే అవ‌కాశం అందిపుచ్చుకున్నారు.  

8. విల‌న్ పాత్ర‌లో క‌న్న‌డ న‌టుడు

రాయలసీమ నేపథ్యంలో 'ఎన్‌బీకే 107' సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో క‌న్న‌డ స్టార్ న‌టుడు దునియా విజ‌య్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. దునియా విజ‌య్ మొద‌టిసారి న‌టిస్తున్నారు. విల‌న్‌గా డిఫ‌రెంట్ స్టైల్‌లో వెండితెర‌పై ర‌చ్చ చేయ‌నున్నారు.

9. డిసెంబ‌ర్ 2న విడుద‌ల‌!

బాల‌కృష్ణ‌కు అఖండ భారీ విజ‌యాన్ని అందించింది. ఈ సినిమా విడుద‌లైన డిసెంబ‌ర్ 2 తేదీనే 'ఎన్‌బీకే 107'ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. డిసెంబ‌ర్ 2 న విడుద‌ల చేస్తే సంక్రాంతికి కూడా బ‌రిలో ఉంటుంద‌ని భావిస్తున్నారు. 

10. టైటిల్ ఖ‌రారైన‌ట్టేనా!

ఈ సినిమాకు 'అన్న‌గారు' అనే టైటిల్ ఖ‌రారు చేస్తార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 'జై బాల‌య్య‌' అనే పేరు కూడా ప‌రిశీల‌న‌లో ఉంది. దీపావ‌ళికి 'ఎన్‌బీకే 107' టైటిల్ ప్ర‌క‌టిస్తార‌ని టాక్. 

Read More: NBK 107: బాల‌కృష్ణ (Balakrishna) కొత్త లుక్‌ను పోస్ట్ చేసిన ద‌ర్శ‌కుడు.. ట‌ర్కీలో 'ఎన్‌బీకే 107' షూటింగ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!