టాలీవుడ్ లోకి శ్రీను వైట్ల (Sreenu Vaitla) రీ ఎంట్రీ.. గోపీచంద్ తో (Gopichand) నెక్ట్స్ సినిమా..!

Updated on Oct 08, 2022 02:42 PM IST
తాజాగా శ్రీనువైట్ల (Sreenu Vaitla) గోపీచంద్‌తో (Hero Gopichand) నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
తాజాగా శ్రీనువైట్ల (Sreenu Vaitla) గోపీచంద్‌తో (Hero Gopichand) నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

టాలీవుడ్ లో వినోదభరితంగా సాగే యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు శ్రీను వైట్ల (Sreenu Vaitla) . అప్పట్లో ఈయన సినిమా వచ్చిందంటే కచ్చితంగా బాక్సాఫీస్ బద్ధలైపోయేది. వరుసగా అగ్ర హీరోలతో సినిమాలు చేసి ఆ తర్వాత పూర్ కంటెంట్‌తో సినిమాలు చేసి ఫేడవుడ్ అయిపోయాడు.

శ్రీను వైట్ల కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సినిమాల్లో 'ఢీ' (Dhee Movie) మూవీ ఒకటి. ఈ మూవీ లో మంచు విష్ణు (Manchu Vishnu) హీరో గా నటించగా, జెనీలియా హీరోయిన్ గా నటించింది. కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన డి మూవీ అప్పట్లో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది.

ఇవివి సత్యనారాయణ తర్వాత కామెడీ యాక్షన్ చిత్రాలకు శ్రీను వైట్ల పేరే ఎక్కువగా వినిపించేది. అయితే, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో (Junior NTR) తెరకెక్కించిన 'బాద్‌షా' సినిమా తర్వాత చేసిన ‘ఆగడు’, ‘బ్రూస్‌లీ,‘మిస్టర్’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ వంటి వరుస ఫ్లాపులతో కనుమరుగయ్యాడు. ఇక, ఆ మధ్య మంచు విష్ణుతో ‘ఢీ’ సీక్వెల్ (Dhee Sequel) చేస్తున్నట్టు ప్రకటించినా.. ఎందుకో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు శ్రీను వైట్ల నుంచి కొత్త కబురు అందింది.

తాజాగా శ్రీనువైట్ల (Sreenu Vaitla) గోపీచంద్‌తో (Hero Gopichand) నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు ప్రకటించారు. తన చిరకాల మిత్రుడు రచయిత గోపీమోహన్ ఈ చిత్రానికి కథ అందించనున్నట్లు ట్విటర్ లో ప్రకటించారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు. గోపీచంద్ 

గోపీచంద్ విషయానికొస్తే.. ప్రస్తుతం 'లక్ష్యం 2' (Lakshyam 2) చిత్రంతో సెట్స్ పై బిజీగా ఉన్నారు. అంతకుముందు ఈ ఏడాది 'పక్కా కమర్షియల్' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ చిత్రం సరైన ఫలితం అందుకోలేదు. ఈ చిత్రంలో గోపీచంద్ తొలిసారి లాయర్ పాత్రలో నటించారు. గోపీచంద్ ప్రముఖ తమిళ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే అన్నట్లు టాక్ నడుస్తోంది.

Read More: Gopichand : గోపీచంద్ సినిమాలో కొత్త ప్రయోగం.. 'ప్రేమదేశం' హీరో అబ్బాస్‌కు ఛాన్స్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!