పెరుగుతున్న ఇమేజ్‌తో ఛేంజ్ అయిన టాలీవుడ్‌ (Tollywood) స్టార్‌‌ హీరోల టైటిల్స్‌

Updated on Nov 21, 2022 04:58 PM IST
సూపర్‌‌స్టార్ కృష్ణ నుంచి గోపీచంద్ వరకు ఇమేజ్‌తోపాటు టైటిల్స్‌ మారిన టాలీవుడ్‌ (Tollywood) స్టార్‌‌ హీరోలు
సూపర్‌‌స్టార్ కృష్ణ నుంచి గోపీచంద్ వరకు ఇమేజ్‌తోపాటు టైటిల్స్‌ మారిన టాలీవుడ్‌ (Tollywood) స్టార్‌‌ హీరోలు

హీరోలకు సినిమా సినిమాకి స్టార్ డమ్‌ పెరుగుతుంది. ఆ స్టార్‌‌ డమ్‌తో అభిమానులు, ఇండస్ట్రీలో వారి బాధ్యత కూడా పెరుగుతుంది. అంతేకాదు, వరుసగా సినిమాలు హిట్‌ అవుతూ ఉంటే అభిమానులు వాళ్లకు పెట్టే పేర్లు / ట్యాగ్స్‌ కూడా అప్‌డేట్ అవుతూ ఉంటాయి. స్టార్ హీరో ఇమేజ్‌ను సొంతం చేసుకునే హీరోల పేర్లకు ముందు ఈ ట్యాగ్స్ ఉండడం అనేది ఒక ట్రెండ్.

అంతేనా.. అభిమానులకు అదో బ్రాండ్ నేమ్ అని కూడా చెప్పకోవాలి. ఆ బ్రాండ్‌ నేమ్‌తో చాలా మంది ఆయా హీరోలను పిలుస్తుంటారు. ఈ ట్రెండ్ అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉన్నా.. టాలీవుడ్‌ (Tollywood)లో మాత్రం ఇది కొంచెం ఎక్కువేనని చెప్పుకోవాలి. టాలీవుడ్‌లో ట్యాగ్‌ నేమ్స్‌ మారిన టాప్ హీరోల వివరాలు పింక్‌విల్లా ఫాలోవర్స్ కోసం..

సూపర్‌‌స్టార్ కృష్ణ నుంచి గోపీచంద్ వరకు ఇమేజ్‌తోపాటు టైటిల్స్‌ మారిన టాలీవుడ్‌ (Tollywood) స్టార్‌‌ హీరోలు

‘సూపర్‌‌స్టార్’ కృష్ణ (Krishna) :

తన టాలెంట్‌, హార్డ్‌వర్క్‌తో ఇండస్ట్రీలో ఎంతో ఎత్తుకు ఎదిగారు కృష్ణ. ‘తేనె మనసులు’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన నటనతో మెప్పించిన కృష్ణకు ముందుగా నటశేఖర అనే ట్యాగ్ లభించింది. అనంతరం ఆయన తెరకెక్కించిన సినిమాలు సూపర్‌‌హిట్‌ కావడంతోపాటు, డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ కొత్త టెక్నాలజీని ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణ.  

హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా సూపర్‌‌హిట్‌ సినిమాలను తెరకెక్కించిన కృష్ణ ‘సూపర్‌‌స్టార్’ అయ్యారు. ఆయన దర్శకత్వం వహించి, నిర్మించిన ‘సింహాసనం’ సినిమా నుంచే స్క్రీన్‌పై కృష్ణ (Krishna) పేరుకు ముందు ‘సూపర్‌‌స్టార్’ ట్యాగ్‌ వేసేవారు.సూపర్‌‌స్టార్ కృష్ణ నుంచి గోపీచంద్ వరకు ఇమేజ్‌తోపాటు టైటిల్స్‌ మారిన టాలీవుడ్‌ (Tollywood) స్టార్‌‌ హీరోలు

సూపర్‌‌స్టార్ కృష్ణ నుంచి గోపీచంద్ వరకు ఇమేజ్‌తోపాటు టైటిల్స్‌ మారిన టాలీవుడ్‌ (Tollywood) స్టార్‌‌ హీరోలు

‘మెగాస్టార్’ చిరంజీవి (Chiranjeevi) :

ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో టాప్‌ ప్లేస్‌కు చేరుకున్న హీరో చిరంజీవి. ప్రాణం ఖరీదు సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుసెట్టిన చిరు..150కు పైగా సినిమాల్లో నటించారు. తన నటన, డ్యాన్స్, ఫైట్స్‌తో మాస్ ప్రేక్షకులను అలరించి మెగాస్టార్‌‌గా ఎదిగారు. అయితే మెగాస్టార్‌‌ అనే ట్యాగ్‌లైన్‌కు ముందు చిరంజీవికి మో రెండు ట్యాగ్స్ ఉండేవి.

తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్‌ తెచ్చుకున్న చిరుకి ముందుగా లభించిన ట్యాగ్‌ ‘డైనమిక్‌ హీరో’. అనంతర కాలంలో ఆయనకు ‘సుప్రీం హీరో’ అనే ట్యాగ్‌ కూడా దక్కింది. ‘మరణమృదంగం’ సినిమా నుంచి చిరంజీవి(Chiranjeevi)కి మెగాస్టార్‌‌ అనే ట్యాగ్ వచ్చింది.

సూపర్‌‌స్టార్ కృష్ణ నుంచి గోపీచంద్ వరకు ఇమేజ్‌తోపాటు టైటిల్స్‌ మారిన టాలీవుడ్‌ (Tollywood) స్టార్‌‌ హీరోలు

‘నటసింహం’ బాలకృష్ణ (Balakrishna) :

నందమూరి తారక రామారావు నట వారుసుడిగా చిన్నతనంలోనే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హీరో నందమూరి బాలకృష్ణ. నటన, హావభావాలు, యాక్షన్‌తో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న బాలయ్య..ఇప్పటివరకు వందకుపైగా సినిమాల్లో నటించారు.

విభిన్నమైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయని బాలకృష్ణకు ముందుగా యువరత్న అనే ట్యాగ్‌ ఉండేది. ఆ ట్యాగ్‌తోనే అభిమానులు బాలయ్యను పిలుచుకునేవారు. అయితే, బోయపాటి దర్శకత్వం వహించిన సింహా సినిమా నుంచి బాలకృష్ణ (Balakrishna) పేరుకు ముందు ‘నటసింహం’ అనే ట్యాగ్‌ వేస్తున్నారు.

సూపర్‌‌స్టార్ కృష్ణ నుంచి గోపీచంద్ వరకు ఇమేజ్‌తోపాటు టైటిల్స్‌ మారిన టాలీవుడ్‌ (Tollywood) స్టార్‌‌ హీరోలు

‘కింగ్‌’ నాగార్జున (Nagarjuna) :

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో అక్కినేని నాగార్జున. 1986వ సంవత్సరంలో వచ్చిన ‘విక్రమ్‌’ సినిమా నుంచి మొన్నటి ‘ది ఘోస్ట్’ వరకు ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్లు చేసి అభిమానులను మెప్పించారు నాగ్. స్టైలిష్‌, యంగ్‌ లుక్స్‌తో అలరించే నాగార్జున పేరు ముందు ‘యువసామ్రాట్‌’ అనే ట్యాగ్‌ ఉండేది.

అయితే కింగ్‌ సినిమాతో ప్రేక్షకులను అలరించారు నాగ్. ఆ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ..ఆ సినిమాలో నాగార్జున నటనకు మంచిపేరు వచ్చింది. ‘రగడ’ సినిమా నుంచి నాగార్జున (Nagarjuna) పేరుకు ముందు ‘కింగ్‌’ ట్యాగ్‌ వేస్తున్నారు.

సూపర్‌‌స్టార్ కృష్ణ నుంచి గోపీచంద్ వరకు ఇమేజ్‌తోపాటు టైటిల్స్‌ మారిన టాలీవుడ్‌ (Tollywood) స్టార్‌‌ హీరోలు

‘సూపర్‌‌స్టార్’ మహేష్‌బాబు (MaheshBabu) :

కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్‌బాబు.. చైల్డ్‌ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న మహేష్‌.. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా నుంచి మహేష్‌బాబు పేరుకు ముందు ప్రిన్స్ అనే ట్యాగ్‌ ఉండేది.

బ్లాక్‌బస్టర్‌‌ సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు మహేష్‌. ఈ క్రమంలో మహేష్‌బాబుకు సూపర్‌‌స్టార్ ట్యాగ్‌ వేసేశారు అభిమానులు. ప్రస్తుతం మహేష్‌ (MaheshBabu)ను.. సూపర్‌‌స్టార్ అని పిలుచుకుంటున్నారు అభిమానులు.

సూపర్‌‌స్టార్ కృష్ణ నుంచి గోపీచంద్ వరకు ఇమేజ్‌తోపాటు టైటిల్స్‌ మారిన టాలీవుడ్‌ (Tollywood) స్టార్‌‌ హీరోలు

‘పాన్‌ ఇండియా స్టార్’ ప్రభాస్ (Prabhas) :

రెబల్‌స్టార్‌‌ కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో ప్రభాస్‌. మాస్‌, యాక్షన్ సినిమాలతో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న ప్రభాస్.. రెబల్‌స్టార్ ట్యాగ్‌ను దక్కించుకున్నారు. తన స్టైల్‌, లుక్స్‌తో క్లాస్‌ ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు ప్రభాస్.

ఇక, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు ప్రభాస్. ఈ సినిమాల తర్వాత వచ్చిన సినిమాలలో ప్రభాస్ (Prabhas) పేరుకు ముందు ‘పాన్ ఇండియా స్టార్’ ట్యాగ్‌ వేస్తున్నారు.

సూపర్‌‌స్టార్ కృష్ణ నుంచి గోపీచంద్ వరకు ఇమేజ్‌తోపాటు టైటిల్స్‌ మారిన టాలీవుడ్‌ (Tollywood) స్టార్‌‌ హీరోలు

‘ఐకాన్‌స్టార్’ అల్లు అర్జున్ (Allu Arjun) :

గంగోత్రి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హీరో ‘అల్లు అర్జున్’. రెండో సినిమా ఆర్య’తోనే సూపర్‌‌హిట్ అందుకున్న బన్నీ..యాక్టింగ్, డ్యాన్స్‌, గ్రేస్‌తో స్టైలిష్‌ స్టార్‌‌గా పేరు తెచ్చుకున్నారు. సినిమా సినిమాకు విభిన్నమైన స్టైల్‌ను అనుసరిస్తూ ‘స్టైలిష్ స్టార్‌‌’ ట్యాగ్‌ను సొంతం చేసుకున్నారు.

తన డ్యాన్స్‌, స్టోరీ సెలెక్షన్, హార్డ్‌వర్క్‌తో ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టూ ఎదుగుతూ ‘ఐకాన్‌ స్టార్‌‌’ అయ్యారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ (Allu Arjun) పేరుకు ముందు ‘ఐకాన్ స్టార్’ ట్యాగ్ వేస్తున్నారు.

సూపర్‌‌స్టార్ కృష్ణ నుంచి గోపీచంద్ వరకు ఇమేజ్‌తోపాటు టైటిల్స్‌ మారిన టాలీవుడ్‌ (Tollywood) స్టార్‌‌ హీరోలు

‘మాస్‌ మహారాజా’ రవితేజ (RaviTeja) :

చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ హీరోగా ఎదిగారు రవితేజ. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్​ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ సినిమాలో మొదటిసారి హీరోగా చేశారు. వరుసగా హిట్‌ సినిమాలు చేస్తూ మాస్ ప్రేక్షకులను అలరిస్తూ ‘మాస్ హీరో’ ట్యాగ్‌ దక్కించుకున్నారు రవితేజ.

స్టార్ హీరో ఇమేజ్‌ను సంపాదించుకున్న రవితేజ.. బ్లాక్‌బస్టర్ హిట్‌ సినిమాల్లో నటిస్తూ ‘మాస్‌ మహారాజా’గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రవితేజ (RaviTeja) పేరుకు ముందు ‘మాస్ మహారాజా’ అనే ట్యాగ్ వేస్తున్నారు.

సూపర్‌‌స్టార్ కృష్ణ నుంచి గోపీచంద్ వరకు ఇమేజ్‌తోపాటు టైటిల్స్‌ మారిన టాలీవుడ్‌ (Tollywood) స్టార్‌‌ హీరోలు

‘యంగ్‌ టైగర్‌‌’ ఎన్టీఆర్‌ (Junior NTR)‌ :

‘నిన్ను చూడాలని’ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. బాలనటుడిగా పలు సినిమాల్లో అలరించిన జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌.. రెండో సినిమా ‘స్టూడెంట్ నంబర్‌‌1’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. నటన, డ్యాన్స్, డైలాగ్ డిక్షన్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్న ఎన్టీఆర్‌‌కు ‘యంగ్‌ టైగర్’ ట్యాగ్ ఉంది.

శక్తి సినిమాలో ‘A1 స్టార్’ ట్యాగ్‌ను ఎన్టీఆర్ పేరుకు ముందు వేశారు. అయితే ఆ సినిమా జూనియర్ ఎన్టీఆర్‌‌ (Junior NTR)‌ కెరీర్‌‌లో డిజాస్టర్‌‌గా నిలిచింది. దాంతో ఆ తర్వాత సినిమాల్లో మళ్లీ ‘యంగ్‌ టైగర్’ ట్యాగ్‌నే వేస్తున్నారు.

సూపర్‌‌స్టార్ కృష్ణ నుంచి గోపీచంద్ వరకు ఇమేజ్‌తోపాటు టైటిల్స్‌ మారిన టాలీవుడ్‌ (Tollywood) స్టార్‌‌ హీరోలు

‘మాచో స్టార్’ గోపీచంద్ (Gopichand) :

తొలివలపు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు గోపీచంద్. ఈ సినిమా కమర్షియల్‌గా హిట్‌ కాకపోయినా నటుడిగా మాత్రం మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ సినిమాలలో విలన్‌గా నటించి క్రేజ్ తెచ్చుకున్నారు గోపీచంద్. అనంతరం యజ్క్షం సినిమా నుంచి హీరోగా యాక్షన్‌ సినిమాలు చేస్తూ ‘యాక్షన్ హీరో’ అయ్యారు.

కొంతకాలంగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ (Gopichand).. కొత్త లుక్‌తో చేసిన సినిమాలు చేస్తూ క్లాస్‌ ప్రేక్షకులకు కూడా దగ్గరవుతున్నారు. ఇటీవల ఆయన పేరుకు ముందు ‘మాచో స్టార్’ అనే ట్యాగ్ వేస్తున్నారు. 

Read More : ‘హాస్య బ్రహ్మ’ బ్రహ్మానందం (Brahmanandam) కామెడీతో రికార్డులు బద్దలుకొట్టిన టాప్‌10 సినిమాలు

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!