Gopichand: గోపిచంద్ 'పక్కా కమర్షియల్' పక్కా హిట్ సాధిస్తుందన్న చిత్ర యూనిట్
Gopichand: టాలీవుడ్‌లో మల్టీ రోల్స్‌తో.. డిఫెరెంట్ యాక్షన్ సినిమాలు చేసిన నటుడు గోపిచంద్. హీరోగా హిట్‌లు సాధించిన గోపించంద్ విలన్‌గా కూడా నటించి మెప్పించారు. అయితే ఈ మధ్య వరుస ఫ్లాపులు గోపిచంద్‌ను నిరాశపరిచాయి. కానీ తన కొత్త సినిమా పక్కా కమర్షియల్ సినిమాతో పక్కా ఎంటర్‌టైన్ చేస్తానంటున్నారు.
గోపిచంద్ నటించిన పక్కా కమర్షియల్ (Pakka Commercial) సినిమా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, UV క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జులై 1న పక్కా కమర్షియల్ సినిమా రిలిజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా మే 20 న విడుదల చేస్తామని మొదట చెప్పారు. కానీ రిలీజ్‌ను దాదాపు రెండు నెలలు పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాలో జన్మించినా.. మరణించినా.. అవదా ఖర్చు అంటూ సాగిన టైటిల్ పాటను స్వర్గీయ గేయ రచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి రాశారు.
Pakka Commercial: పక్కా కమర్షియల్ సినిమాలో గోపిచంద్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. గోపిచంద్ క్యారెక్టర్‌ను మారుతి పక్కా క్లాస్ లుక్‌లో క్రియేట్ చేశారు. ఇమేజిన్ చేసి చూసుకోండి కిక్కాస్ ఉంటుంది అంటూ గోపిచంద్‌తో మాస్ డైలాగులు చెప్పించారు మారుతి. పోస్టర్‌లో చూస్తే గోపిచంద్ చాలా స్టైలిష్‌గా అందంగా కనిపిస్తున్నారు. ఇంతకు ముందు సినిమాల కంటే డిఫెరెంట్ లుక్‌తో పాటు కొత్త కథతో ఈ సినిమాను మారుతి తెరకెక్కిస్తున్నారట. సత్యరాజ్ పక్కా కమర్షియల్ సినిమాలో కీలక రోల్‌లో నటిస్తున్నారు. గోపిచంద్‌కు జోడిగా రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
జీఏ2 పిక్చర్స్,యూవీ క్రియేషన్స్,బన్నీవాసు కాంబోలో వచ్చిన భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే సినిమాలు హిట్‌గా నిలిచాయి. మారుతీ దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా మరో హిట్ సినిమా ప్రేక్షకులకు అందించాలని ప్రొడ్యూసర్లు భావిస్తున్నారు. ఎస్ కెఎన్ సహ నిర్మాతగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.లౌక్యం తర్వాత గోపిచంద్ (Gopichand) సినిమాలు అంత హిట్ అవలేదు. పక్కా కమర్షియల్‌తో బ్లాక్ బాస్టర్ హిట్ సాధిస్తామని చిత్ర యూనిట్ అంటోంది.