God Father: 'గాడ్‌ఫాద‌ర్' సినిమా చూసి చిరంజీవి (Chiranjeevi) ఏమ‌న్నారు?. ద‌ర్శ‌కుడికి చిరు స‌ల‌హా

Updated on Sep 10, 2022 12:26 PM IST
మలయాళ చిత్రం 'లూసిఫర్‌'కు రీమేక్‌గా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) న‌టిస్తున్న‌ 'గాడ్ ఫాదర్' తెరకెక్కుతోంది.
మలయాళ చిత్రం 'లూసిఫర్‌'కు రీమేక్‌గా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) న‌టిస్తున్న‌ 'గాడ్ ఫాదర్' తెరకెక్కుతోంది.

God Father: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 'ఆచార్య' డిజాస్ట‌ర్ త‌రువాత ప‌లు సినిమాల్లో న‌టిస్తున్నారు. ప్రేక్ష‌కుల‌తో పాటు అభిమానుల‌కు వ‌రుస సినిమాల‌తో వినోదం పంచాల‌ని నిర్ణ‌యించుకున్నారు. చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న‌ 'గాడ్‌ఫాద‌ర్' సినిమా అప్‌డేట్స్ రీసెంట్‌గా రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఫైన‌ల్ కాపీని చిరంజీవి చూశార‌ట‌. చిరంజీవి త‌న సినిమా గాడ్‌ఫాద‌ర్ చూసి ఎలా రియాక్ట్ అయ్యారు?.

రీమేక్ సినిమా

మలయాళ చిత్రం 'లూసిఫర్‌'కు రీమేక్‌గా 'గాడ్ ఫాదర్' తెరకెక్కుతోంది. 'గాడ్‌ఫాద‌ర్‌'లో సాత్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార కూడా న‌టించడం విశేషం. ఈ సినిమాలో న‌య‌న‌తార ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవలే మేక‌ర్స్ రిలీజ్ చేశారు. 'సైరా'లో చిరంజీవి సతీమణిగా న‌టించిన న‌య‌న‌తార‌.. 'గాడ్ ఫాద‌ర్‌'లో ఆయనకు చెల్లెలుగా న‌టిస్తున్నారు.

మలయాళ చిత్రం 'లూసిఫర్‌'కు రీమేక్‌గా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) న‌టిస్తున్న‌ 'గాడ్ ఫాదర్' తెరకెక్కుతోంది.

'గాడ్‌ఫాద‌ర్' సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాట‌లో చిరంజీవి (Chiranjeevi), సల్మాన్ ఖాన్‌లు కలిసి స్టెప్పులేయ‌నున్నారు. అలాగే  సునీల్, సత్యదేవ్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

స్టార్ కొరియోగ్రాఫ‌ర్, దర్శకుడు అయిన ప్ర‌భుదేవా కూడా ఈ సినిమా కోసం కొన్ని డ్యాన్సులు కంపోజ్ చేశారు. త‌మ‌న్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ప్ర‌మోష‌న్ల జోరు పెంచండి : చిరు

పొలిటికల్ థ్రిల్లర్‌గా 'గాడ్‌ఫాద‌ర్' సినిమా అక్టోబ‌ర్ 5న అంటే విజయదశమి రోజున రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ల జోరు పెంచారు. మ‌రోవైపు చిరంజీవి త‌న సినిమా ఫైన‌ల్ కాపీని చూశార‌ట‌. ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజాను చిరంజీవి మెచ్చుకున్నార‌ట‌. అవుట్ పుట్ బాగుందని చెప్పార‌ట‌. అలాగే ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల‌ని స‌ల‌హా ఇచ్చార‌ట‌ చిరంజీవి.

Read More: దసరా కానుకగా అక్టోబర్ 5న రాబోతున్న చిరంజీవి 'గాడ్ ఫాదర్' (God Father).. రూమర్లు నమ్మవద్దంటూ నిర్మాత ప్రకటన..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!