దసరా కానుకగా అక్టోబర్ 5న రాబోతున్న చిరంజీవి 'గాడ్ ఫాదర్' (God Father).. రూమర్లు నమ్మవద్దంటూ నిర్మాత ప్రకటన..!

Updated on Sep 07, 2022 09:43 PM IST
తాజాగా 'గాడ్‌ఫాదర్' సినిమా రిలీజ్ డేట్‌ను (God Father Release Date) చిత్ర నిర్మాత అధికారికంగా ప్రకటిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
తాజాగా 'గాడ్‌ఫాదర్' సినిమా రిలీజ్ డేట్‌ను (God Father Release Date) చిత్ర నిర్మాత అధికారికంగా ప్రకటిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా వస్తున్న తాజా సినిమా 'గాడ్‌ఫాదర్' (God Father). మలయాళంలో మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన 'లూసిఫర్' మూవీకి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమాతో తెలుగులో నేరుగా మొదటిసారి నటిస్తున్నారు.

'గాడ్‌ఫాదర్' నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు (God Father First Look) మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి రఫ్‌లుక్‌ లో కేక పుట్టించారు. ఈ సినిమాలో చిరంజీవి తన ఏజ్‌కు తగ్గ పాత్రలో నటించారు. కాగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇటీవలే చిరు బర్త్ డే సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. 

ఇదిలా ఉంటే.. 'గాడ్‌ఫాదర్‌‌' సినిమాలో చిరంజీవి (Chiranjeevi) తనకు కలిసొచ్చే ఖైదీ పాత్రలో కూడా కనిపించనున్నారు. ఇదివరకు వచ్చిన ‘ఖైదీ, ‘ఖైదీ నంబర్ 786’, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, అల్లుడా మజాకా, ఖైదీ నంబర్ 150 సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఆ సినిమాలు మెగాస్టార్ కెరీర్‌‌లో మైలురాళ్లుగా నిలిచాయి. 

ఈ నేపథ్యంలో, 'గాడ్‌ఫాదర్' (God Father) సినిమాలో కూడా చిరంజీవి ఖైదీ గెటప్‌లో కనిపిస్తుండడంత సెంటిమెంట్ ప్రకారం బాక్సాఫీస్ దగ్గర  సినిమా రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా 'గాడ్‌ఫాదర్' సినిమా రిలీజ్ డేట్‌ను (God Father Release Date) చిత్ర నిర్మాత అధికారికంగా ప్రకటిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. నిర్మాత ఎన్వీ రమణ.. పోస్టు చేస్తూ.. "ఇక ఎలాంటి రూమర్స్‌ను నమ్మొద్దు. మెగాస్టార్ చిరు నటించిన 'గాడ్ ఫాదర్' అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. త్వరలోనే ప్రమోషన్లను కూడా మేం మొదలు పెడుతాం" అని పేర్కొన్నారు.

Read More: Godfather Teaser: దుమ్ము రేపుతున్న 'గాడ్ ఫాదర్' టీజర్.. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు పూనకాలే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!