God Father: చిరంజీవి (Chiranjeevi) గాడ్‌ఫాదర్ ఓటీటీ రైట్స్‌కు కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించిన అమెజాన్!

Updated on Aug 27, 2022 04:18 PM IST
చిరంజీవి (Chiranjeevi) 'గాడ్ ఫాదర్' సినిమా ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింద‌ట‌.
చిరంజీవి (Chiranjeevi) 'గాడ్ ఫాదర్' సినిమా ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింద‌ట‌.

God Father: 'ఆచార్య' ఫ్లాప్ తర్వాత టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు.  చిరంజీవి బ‌ర్త్ డే రోజున 'గాడ్‌ఫాద‌ర్' టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. మ‌ల‌యాళ చిత్రం 'లూసిఫ‌ర్' చిత్రానికి రీమేక్‌గా తెలుగులో గాడ్‌ఫాద‌ర్ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. కోలీవుడ్ డైరెక్ట‌ర్‌ మోహ‌న్ రాజా ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

'గాడ్‌ఫాద‌ర్' సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాట‌లో చిరంజీవి  (Chiranjeevi) , సల్మాన్ ఖాన్‌లు కలిసి స్టెప్పులేయ‌నున్నారు. నయనతార, స‌త్య‌దేవ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. స్టార్ కొరియోగ్రాఫ‌ర్, దర్శకుడు అయిన ప్ర‌భుదేవా (Prabhu Deva) కూడా ఈ సినిమా కోసం వ‌ర్క్ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జ‌రుగుతోంది. 

చిరంజీవి (Chiranjeevi) 'గాడ్ ఫాదర్' సినిమా ఓటీటీ రైట్స్‌ను, ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింద‌ట‌.

ఓటీటీ హ‌క్కుల‌ను కొనుగోలు చేసిన బ‌డా సంస్థ‌

'గాడ్ ఫాదర్' సినిమా ఓటీటీ రైట్స్‌ను, ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింద‌ట‌. దాదాపు రూ. 50 కోట్ల‌తో 'గాడ్‌ఫాద‌ర్' ఓటీటీ హ‌క్కుల‌ను సొంతం చేసుకోనుంది. కేవలం తెలుగు ఓటీటీ హక్కుల్ని మాత్రమే అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిందా? లేక హిందీ హక్కుల్ని కూడా తీసుకుందా అనేది తెలియాల్సి ఉంది.

Read More: Godfather Teaser: దుమ్ము రేపుతున్న 'గాడ్ ఫాదర్' టీజర్.. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు పూనకాలే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!