God Father: 'గాడ్‌ఫాద‌ర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ రాయ‌ల‌సీమ‌లో.. ముఖ్య అతిథిగా రానున్న‌ స‌ల్మాన్ ఖాన్‌!

Updated on Sep 25, 2022 02:22 PM IST
God Father: 'గాడ్‌ఫాద‌ర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవితో పాటు బాలీవుడ్ స‌ల్మాన్ ఖాన్ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.
God Father: 'గాడ్‌ఫాద‌ర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవితో పాటు బాలీవుడ్ స‌ల్మాన్ ఖాన్ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

God Father: టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) న‌టించిన 'గాడ్‌ఫాద‌ర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆంధ్ర ప్రదేశ్‌లోని అనంత‌పురంలో సెప్టెంబ‌ర్ 28న జ‌ర‌గ‌నుంది. త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'గాడ్‌ఫాద‌ర్' సినిమా అక్టోబ‌ర్ 5 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

మెగాస్టార్ సతీమణి  కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలింస్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. 
 

God Father: 'గాడ్‌ఫాద‌ర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవితో పాటు బాలీవుడ్ స‌ల్మాన్ ఖాన్ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

సెన్సార్ పూర్తి

ఇప్ప‌టికే 'గాడ్‌ఫాద‌ర్' (God Father) సినిమా సెన్సార్ పూర్త‌యింద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో చిరంజీవికి సంబంధించిన పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. చిరంజీవి పంచెక‌ట్టులో క‌నిపించి స‌ర్‌ప్రైజ్ చేశారు. ‘యు/ఎ’ స‌ర్టిఫికేట్ కూడా పొందామ‌ని చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా త‌న సోష‌ల్ మీడియాలో తెలిపారు. ఈ సినిమాను చూసిన సెన్సార్ స‌భ్యులు అభినందించార‌న్నారు. 'గాడ్‌ఫాద‌ర్' సినిమాను ప్రేక్ష‌కులు చూసి బ్లాక్ బాస్ట‌ర్ హిట్ చేయాల‌ని కోరారు. 

అనంత‌పురంలో ప్రీ రిలీజ్ వేడుక 

'గాడ్‌ఫాద‌ర్' సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌ను ఏపీలో నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఈవెంట్ అనంత‌పురంలోని గ‌వ‌ర్న‌మెంట్ ఆర్ట్స్ కాలేజీలో సెప్టెంబ‌ర్ 28 తేదీన‌ 6 గంట‌ల‌కు ప్రారంభంకానుంది. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవితో పాటు బాలీవుడ్ స‌ల్మాన్ ఖాన్ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా న‌య‌న‌తార కూడా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ కానుంద‌ని స‌మాచారం. 

'గాడ్‌ఫాద‌ర్' సినిమాలో స‌ల్మాన్ ఖాన్ ఓ నెగెటీవ్ షేడ్ పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట‌. చిరంజీవి చెల్లెలుగా న‌య‌న‌తార న‌టిస్తున్నారు. స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. పూరీ జ‌గ‌న్నాథ్ ఈ సినిమాలో ఓ జ‌ర్న‌లిస్టు పాత్ర‌లో న‌టించారట‌. చిరంజీవి స్వ‌యంగా పూరీ పాత్ర గురించి రీసెంట్‌గా కామెంట్ చేశారు. పూరీ మొద‌ట న‌టించ‌డానికి ఒప్పుకోలేద‌ట‌. కానీ చిరంజీవి అడ‌గ‌టంతో కాద‌న‌లేక‌పోయార‌ట‌. 

Read More: God Father: 'గాడ్‌ఫాద‌ర్' సినిమాకు లైన్ క్లియ‌ర్.. చిరు (Chiranjeevi) లుక్‌తో స‌ర్‌ప్రైజ్ అయిన ఫ్యాన్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!