God Father: 'గాడ్‌ఫాద‌ర్' సినిమాకు లైన్ క్లియ‌ర్.. చిరు (Chiranjeevi) లుక్‌తో స‌ర్‌ప్రైజ్ అయిన ఫ్యాన్స్

Updated on Sep 23, 2022 07:36 PM IST
చిరంజీవి (Chiranjeevi) కొత్త లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. చిరంజీవి స్టైలిష్ లుక్ అద‌ర‌హో అంటున్నారు మెగా అభిమానులు. 
చిరంజీవి (Chiranjeevi) కొత్త లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. చిరంజీవి స్టైలిష్ లుక్ అద‌ర‌హో అంటున్నారు మెగా అభిమానులు. 

God Father: టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) న‌టించిన 'గాడ్‌ఫాద‌ర్' విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ 'గాడ్ ఫాద‌ర్' అక్టోబ‌ర్ 5 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్‌డేట్స్‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అంతేకాకుండా చిరంజీవి కొత్త లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. చిరంజీవి స్టైలిష్ లుక్ అద‌ర‌హో అంటున్నారు మెగా అభిమానులు. 

'గాడ్‌ఫాద‌ర్' సినిమా సెన్సార్ పూర్త‌యింద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో చిరంజీవికి సంబంధించిన పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. చిరంజీవి (Chiranjeevi) పంచెక‌ట్టులో క‌నిపించి స‌ర్‌ప్రైజ్ చేశారు. ‘యు/ఎ’ స‌ర్టిఫికేట్ కూడా పొందామ‌ని చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా త‌న సోష‌ల్ మీడియాలో తెలిపారు. ఈ సినిమాను చూసిన సెన్సార్ స‌భ్యులు అభినందించార‌న్నారు. 'గాడ్‌ఫాద‌ర్' సినిమాను ప్రేక్ష‌కులు చూసి బ్లాక్ బాస్ట‌ర్ హిట్ చేయాల‌ని కోరారు. 

ఓ రేంజ్‌లో న‌య‌న్ పాత్ర‌

మలయాళ చిత్రం 'లూసిఫర్‌'కు రీమేక్‌గా 'గాడ్ ఫాదర్' తెరకెక్కుతోంది. 'గాడ్‌ఫాద‌ర్‌'లో సాత్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార కూడా న‌టించడం విశేషం. ఈ సినిమాలో న‌య‌న‌తార ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవలే మేక‌ర్స్ రిలీజ్ చేశారు. 'సైరా'లో చిరంజీవి (Chiranjeevi) సతీమణిగా న‌టించిన న‌య‌న‌తార‌.. 'గాడ్ ఫాద‌ర్‌'లో ఆయనకు చెల్లెలుగా న‌టిస్తున్నారు.ఈ సినిమాలో 'స‌త్య‌ప్రియ జ‌య‌దేవ్' పాత్ర‌లో న‌య‌న్ క‌నిపించ‌నున్నారు. 

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!