Chiranjeevi & Salman Khan: 'గాడ్ ఫాదర్' మూవీ నుంచి సల్మాన్, చిరంజీవి సీన్ లీక్.. ఫొటో వైరల్ !

Updated on Jul 25, 2022 12:56 PM IST
చిరంజీవి, కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌లపై (Salman khan)తెరకెక్కిస్తున్న సీన్‌ లీకయింది. ఇందులో చిరంజీవి పక్కన సల్మాన్‌ గన్‌ పట్టుకుని ఉన్నారు.
చిరంజీవి, కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌లపై (Salman khan)తెరకెక్కిస్తున్న సీన్‌ లీకయింది. ఇందులో చిరంజీవి పక్కన సల్మాన్‌ గన్‌ పట్టుకుని ఉన్నారు.

Mega 154 Movie: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘గాడ్ ఫాదర్’,‘భోళా శంకర్’, 'మెగా 154' (వాల్తేరు వీరయ్య అనేది వర్కింగ్ టైటిల్) చిత్రాలు ఇప్పుడు సెట్స్‌పై ఉన్నాయి. జులై 4న 'గాడ్ ఫాదర్‌' సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు చిన్నపాటి టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో నెట్టింట దూసుకుపోతోంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఫొటో లీక్‌ అయింది. చిత్రంలోని ఓ సన్నివేశానికి సంబంధించిన ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. చిరంజీవి, కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌లపై (Salman khan) తెరకెక్కిస్తున్న సీన్‌ ఒకటి లీక్‌ అయింది. ఈ ఫొటోలో చిరంజీవి పక్కన సల్మాన్‌ గన్‌ పట్టుకుని ఉన్నారు. విలన్‌ను చంపేందుకు వెళ్లేటప్పుడు చిరంజీవికి సల్లూ భాయ్‌ బాడీగార్డ్‌లా ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

Chiranjeevi & Salman Khan

నెట్టింట వైరల్ అవుతున్న సీన్

‘గాడ్ ఫాదర్’ (God Father Shooting) షూటింగ్‌లో ఇంటెన్సివ్ గా ఉన్న ఈ లుక్‌ చూస్తుంటే క్లైమాక్స్‌‌కు సంబంధించిన సన్నివేశంలా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది.

'మెగా 154' మూవీలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ (Shruti Haasan)  యాక్ట్ చేస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వైజాగ్ జాల‌రీపేట బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. 

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో 'మెగా 154' సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. శుక్ర‌వారం ఈ సినిమా సెట్స్‌లో ర‌వితేజ (Raviteja) జాయిన్ అయిన నేపథ్యంలో.. నేటి నుండి ప‌ది రోజుల పాటు చిరంజీవి, ర‌వితేజ‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కానుంది. 

Read More: 'మెగా 154' (Mega 154) షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టిన మాస్ మహారాజ్ రవితేజ..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!