Chiranjeevi : చిరంజీవి సినిమాల వ‌రుస అప్‌డేట్స్‌తో.. ఫ్యాన్స్‌కు పండుగే !

Updated on Jun 15, 2022 02:12 PM IST
భోళాశంక‌ర్, గాడ్ ఫాద‌ర్, మెగా 154 సినిమాల‌తో చిరంజీవి(Chiranjeevi) బిజీగా ఉన్నారు. 
భోళాశంక‌ర్, గాడ్ ఫాద‌ర్, మెగా 154 సినిమాల‌తో చిరంజీవి(Chiranjeevi) బిజీగా ఉన్నారు. 

టాలీవుడ్‌ సీనియ‌ర్ హీరో మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi) న‌ట‌నకు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. డైలాగులు, డాన్సులు, యాక్ష‌న్ సీన్స్‌లో చిరు అద్భుతంగా న‌టిస్తారు. ఇక కామెడీ చేసేటప్పుడు, బాస్ భ‌లే పంచులు విసురుతారు. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్ష‌కుల‌కు వినోదం అందిస్తున్నారు చిరు.

ఆచార్య ఫ్లాపుతో డీలా ప‌డిన అభిమానుల‌కు చిరు స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌నున్నారు. వ‌రుస సినిమాలను రిలీజ్ చేసి త‌న స‌త్తా ఏంటో చూపించ‌నున్నారు. భోళాశంక‌ర్, గాడ్ ఫాద‌ర్, మెగా 154 సినిమాల‌తో చిరంజీవి ప్ర‌స్తుతం బిజీగా ఉన్నారు. 

భోళాశంక‌ర్, గాడ్ ఫాద‌ర్, మెగా 154 సినిమాల‌తో చిరంజీవి(Chiranjeevi) బిజీగా ఉన్నారు. 

రూటు మార్చిన చిరంజీవి
చిరంజీవి (Chiranjeevi) ఖైదీ నంబ‌ర్ 150 సినిమాతో త‌న రూటు మార్చుకున్నారు. త‌న సీనియారిటీకి త‌గ్గ పాత్ర‌ల‌ను ఎంచుకుంటున్నారు. విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. ఇక డాన్సుల విష‌యంలో ఏ మాత్రం త‌గ్గేదేలే అంటున్నారు చిరంజీవి.

రామ్ చ‌ర‌ణ్‌తో కలిసి ఆచార్యలో స్టెప్పులు

రామ్ చరణ్‌తో క‌లిసి ఆచార్య‌లో చిరు వేసిన స్టెప్పుల‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక తదుపరి సినిమాల్లోనూ చిరంజీవి మాస్ స్టెప్పులు కూడా వేస్తారని అభిమానులు భావిస్తున్నారు. 

 

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న గాడ్ ఫాద‌ర్ సినిమా షూటింగ్ పూర్త‌యింద‌నే టాక్ వినిపిస్తుంది. గాడ్ ఫాద‌ర్ ఫైన‌ల్ షూటింగ్ షెడ్యూల్ జ‌రుగుతుంద‌ట‌. ఆచార్య సినిమా త‌ర్వాత చిరంజీవి త‌న భార్య‌తో క‌లిసి విదేశాల‌కు వెళ్లారు. హాలిడే టూర్ నుంచి తిరిగి రాగానే భోళా శంక‌ర్ షూటింగ్‌కు వెళుతున్నారు. 

భోళాశంక‌ర్, గాడ్ ఫాద‌ర్, మెగా 154 సినిమాల‌తో చిరంజీవి(Chiranjeevi) బిజీగా ఉన్నారు. 

మెగా 154 షూటింగ్
భోళాశంక‌ర్, గాడ్ ఫాద‌ర్ లాంటి సినిమాల్లో న‌టిస్తున్న చిరు మెగా 154 సినిమా షూటింగ్‌ను కూడా ఇటీవలే పూర్తి చేశార‌ట‌.  మెగా 154 సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం. వాల్తేరు వీర‌య్య సినిమాకు బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ద‌ర్శ‌కుడు బాబి వాల్తేరు వీర‌య్య‌కు సంబంధించిన ప‌లు స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించార‌ట‌. విదేశాల్లో కూడా చిరంజీవితో బాబి కొన్ని సీన్లు పూర్తి చేశార‌ని టాక్. 
  
వాల్తేరు వీర‌య్య టైటిల్‌ను అభిమానుల కోసం ముందుగా రిలీజ్ చేశార‌ట‌. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్  నిర్మిస్తోంది. చిరంజీవికి జోడిగా వాల్తేరు వీర‌య్య‌లో శృతి హాసన్ యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. 

భోళాశంక‌ర్, గాడ్ ఫాద‌ర్, మెగా 154 సినిమాల‌తో చిరంజీవి(Chiranjeevi) బిజీగా ఉన్నారు. 

భోళా శంక‌ర్, గాడ్ ఫాద‌ర్ సినిమాల వివ‌రాలు
వేదాళం త‌మిళ్ సినిమాను తెలుగులో భోళా శంక‌ర్‌గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భోళా శంక‌ర్ సినిమాలో చిరంజీవి  (Chiranjeevi), త‌మ‌న్నా జంట‌గా న‌టిస్తున్నారు. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. సాగ‌ర్ మ‌హ‌తి సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై భోళా శంక‌ర్‌ సినిమాను నిర్మిస్తున్నారు. 

ఇక  గాడ్‌ఫాద‌ర్ సినిమా పొలిటిక‌ల్  యాక్ష‌న్ సినిమాగా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా చిరంజీవి సొంత నిర్మాణ సంస్థ కొణిద‌ల ప్రొడ‌క్ష‌న్‌లో నిర్మిస్తున్నారు. చిరంజీవి, న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో గాడ్ ఫాద‌ర్ సినిమా తెర‌కెక్కుతోంది.  

Read More: బ్ర‌హ్మాస్త్రం ట్రైల‌ర్ రిలీజ్.. ఇందులో చిరంజీవి డైలాగ్స్ వెంటే ఫ్యాన్స్ ఈలలు వేయాల్సిందే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!