Laal Singh Chaddha: అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' పై కొత్త అప్డేట్.. రంగంలోకి దిగిన నిర్మాత అల్లు అర‌వింద్ !

Updated on Jul 06, 2022 05:23 PM IST
 Laal Singh Chaddha: అల్లు అర‌వింద్ లాల్ సింగ్ చద్దా చిత్ర రైట్స్‌ను సొంతం చేసుకోవ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. 
Laal Singh Chaddha: అల్లు అర‌వింద్ లాల్ సింగ్ చద్దా చిత్ర రైట్స్‌ను సొంతం చేసుకోవ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. 

Laal Singh Chaddha: బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అక్కినేని నాగ చైత‌న్య సిద్ధ‌మ‌య్యాడు. 'లాల్ సింగ్ చద్దా' చిత్రంలో అమీర్ ఖాన్‌తో క‌లిసి నాగ చైత‌న్య న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నాగ‌చైత‌న్య 'లాల్ సింగ్ చ‌ద్దా'లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

అమీర్ ఖాన్, నాగ చైత‌న్య‌లు సైనికుల పాత్ర‌లలో ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నారు. పాన్ ఇండియా సినిమాగా 'లాల్ సింగ్ చ‌ద్ధా' ఆగ‌స్టు 11 రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్‌కు స్నేహితుడిగా చైత‌న్య  (Naga Chaitanya) న‌టిస్తున్నారు. 

అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కరీనా కపూర్ న‌టిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యి చాలా రోజులు కావస్తోంది. ఇదే క్రమంలో ఇటీవలే 'లాల్ సింగ్ చ‌ద్ధా' సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి వెలువడింది.

 Laal Singh Chaddha: అల్లు అర‌వింద్ 'లాల్ సింగ్ చద్దా' చిత్ర రైట్స్‌ను సొంతం చేసుకోవ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. 

అమీర్ ఖాన్ కోసం రంగంలోకి దిగిన‌ అల్లు అర‌వింద్‌
 Laal Singh Chaddha: 'లాల్ సింగ్ చద్దా' తెలుగు రిలీజ్ హక్కులని ప్ర‌ముఖ నిర్మాత‌ అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయ‌నున్నారు. అల్లు అర‌వింద్ ఈ సినిమాకు భారీ ధ‌ర‌ను చెల్లించి, తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నారు. అల్లు అర‌వింద్ ఈ సినిమా రైట్స్‌ను సొంతం చేసుకోవ‌డంతో ఇదే చిత్రం పై అంచ‌నాలు బాగా పెరిగాయి. 

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ ఖాన్ నటించిన బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌ చిత్రాలలో గ‌జ‌నీ ఒక‌టి. అమీర్ ఖాన్‌తో 'గ‌జినీ' చిత్రాన్ని అల్లు అర‌వింద్ నిర్మించారు. 'గ‌జినీ' బాలీవుడ్‌లో అత్య‌ధిక లాభాల‌ను తెచ్చిపెట్టింది. ప్ర‌స్తుతం మ‌రోసారి అల్లు అర‌వింద్ అమీర్ ఖాన్ సినిమాకు ప్రొడ్యూస‌ర్‌గా మారడం విచిత్రంగా ఉంది కదా. విదేశీ చిత్రం "ఫారెస్ట్ గంప్' ఆధారంగా 'లాల్ సింగ్ చద్దా' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

Read More: Pinkvilla Style Icon Awards : పింక్‌విల్లా స్టైల్ ఐకాన్ అవార్డ్స్ విజేతల వివరాలు.. మీకోసం ప్రత్యేకం !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!