మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi ) థ్యాంక్స్ చెబుతూ బాలీవుడ్‌ స్టార్ అమీర్‌‌ ఖాన్ ట్వీట్.. వైరల్‌

Updated on Jul 18, 2022 12:56 AM IST
చిరంజీవికి (Chiranjeevi ) ఇంట్లో అమీర్ ఖాన్, నాగార్జున, రాజమౌళి, నాగచైతన్య, సుకుమార్, రాంచరణ్
చిరంజీవికి (Chiranjeevi ) ఇంట్లో అమీర్ ఖాన్, నాగార్జున, రాజమౌళి, నాగచైతన్య, సుకుమార్, రాంచరణ్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కోసం బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చ‌ద్దా’ స్పెష‌ల్ షో వేశారు. చిరు ఇంట్లోనే ఏర్పాటు చేసిన ఈ షోకు అమీర్‌తోపాటు నాగార్జున‌, నాగ‌చైత‌న్య, సుకుమార్‌, రాజ‌మౌళి హాజ‌ర‌య్యారు. తెలుగులో లాల్ సింగ్ చ‌ద్దాను స‌మ‌ర్పించనున్నారు చిరంజీవి. ఈ నేప‌థ్యంలో చిరంజీవికి ధ‌న్యవాదాలు తెలిపారు అమీర్ ఖాన్‌.

మాపై అమిత‌మైన ప్రేమ‌ చూపిస్తున్నందుకు చిరంజీవికి థ్యాంక్స్. మీరు అందిస్తున్న సహకారం చాలా గొప్పది. అని క్యాప్షన్ ఇచ్చారు అమీర్ ఖాన్‌. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అమీర్ ఖాన్ ప్రొడ‌క్షన్స్, వ‌యాకామ్ 18 పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఆగ‌స్టు 11న లాల్‌సింగ్ చద్దా థియేట‌ర్లలో విడుద‌ల కానుంది.

చిరంజీవికి (Chiranjeevi ) అమీర్ ఖాన్, నాగచైతన్య

చై బాలీవుడ్‌ డెబ్యూ..

ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా లాల్ సింగ్ చ‌ద్దా సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ ఎంతో కష్టపడ్డారని చిరంజీవి ఇప్పటికే చెప్పారు. ఈ సినిమాతో నాగచైతన్య బాలీవుడ్‌లోకి ఎంటర్‌‌ అవుతున్నారు. బాలీవుడ్‌లోకి చై ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నానని కూడా అన్నారు చిరు (Chiranjeevi). లాల్‌సింగ్ చద్దా సినిమాలో కరీనా కపూర్‌‌ ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటించారు.  

Read More : దేవి శ్రీ ప్రసాద్‌కు భయపడుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్.. కారణం ఏంటంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!