God Father: ‘గాడ్‌ఫాద‌ర్’ మాస్ సాంగ్ రిలీజ్ టైమ్ వ‌చ్చేసింది ... రామ‌జోగ‌య్య శాస్త్రి ఆస‌క్తిక‌ర ట్వీట్

Updated on Sep 15, 2022 06:09 PM IST
God Father: ‘గాడ్‌ఫాద‌ర్’ మాస్  సాంగ్‌ను సాయంత్రం 7.02 గంట‌ల‌కు  విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 
God Father: ‘గాడ్‌ఫాద‌ర్’ మాస్ సాంగ్‌ను సాయంత్రం 7.02 గంట‌ల‌కు  విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 

God Father: టాలీవుడ్ మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) న‌టించిన 'గాడ్‌ఫాద‌ర్' సినిమా అప్‌డేట్స్‌తో అభిమానుల్లో సంద‌డి నెల‌కొంది. 'గాడ్‌ఫాద‌ర్' సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ ప్రోమోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో 'థార్ మార్ థ‌క్క‌ర్ మార్' లిరిక్ ఆస‌క్తిగా అనిపించింది. ఈ పాట‌ను ఎప్పుడెప్పుడు చూసేయాల‌నే ఆతృత‌లో అభిమానులు ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌ల డాన్సు చూడాల‌ని వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 7.02 గంట‌ల‌కు 'థార్ మార్ థ‌క్క‌ర్ మార్' సాంగ్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 

ప్ర‌భుదేవా డైరెక్ట‌న్‌లో డాన్సులు

'థార్ మార్ థ‌క్క‌ర్ మార్' పాట కోసం స్టార్ కొరియోగ్రాఫ‌ర్, దర్శకుడు ప్ర‌భుదేవా కంపోజ్ చేసిన స్టెప్పులు అదిరిపోయాయట. ఈ పాట ప్రోమోలో చిరు, స‌ల్మాన్‌ల కాస్టూమ్స్ కూడా వైవిధ్యంగా ఉన్నాయి. 'థార్ మార్ థ‌క్క‌ర్ మార్' పాట‌ను అనంత శ్రీరామ్ రాశారు. శ్రేయ ఘోషాల్ ఆల‌పించారు. 'గాడ్‌ఫాద‌ర్' సినిమాకు త‌మ‌న్ సంగీతం అందించారు

బాస్ కోసం కంటెంట్ -  రామ‌జోగ‌య్య శాస్త్రి 

గాడ్‌ఫాద‌ర్' సినిమా నుంచి మేకర్స్ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ నేప‌థ్యంలో సినీ గేయ ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఈ సినిమా కోసం ఆయన పాట‌లు రాశార‌ని ఈ ట్వీట్‌ ద్వారా తెలుస్తుంది. తాను రాసిన పాట‌లు బాస్ "చిరంజీవి" (Chiranjeevi) ఎప్పుడెప్పుడు వింటారా అనిపించిందని? అంత బాగా కంటెంట్ కుదిరింద‌ని  రామజోగయ్య శాస్త్రి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సంగీత ద‌ర్శ‌కులు త‌మ‌న్‌కు ప్రత్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు కూడా తెలిపారు.

Read More: దసరా కానుకగా అక్టోబర్ 5న రాబోతున్న చిరంజీవి 'గాడ్ ఫాదర్' (God Father).. రూమర్లు నమ్మవద్దంటూ నిర్మాత ప్రకటన..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!