చిరంజీవి (Chiranjeevi) బ‌ర్త్ డే వేడుక‌లు.. సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న ఫోటోలు

Updated on Aug 23, 2022 08:02 PM IST
చిరంజీవి (Chiranjeevi) పుట్టిన‌రోజు  సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు, అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారు.
చిరంజీవి (Chiranjeevi) పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు, అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) త‌న‌ 67వ పుట్టిన రోజు వేడుకల ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. త‌న కుటుంబ సభ్యుల‌తో క‌లిసి దిగిన ఫోటోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా త‌న పుట్టిన రోజున శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌తీ ఒక్క‌రికి ధన్య‌వాదాలంటూ చిరు ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు. ప్ర‌స్తుతం చిరంజీవి పుట్టినరోజు వేడుక‌ల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చిరు బ‌ర్త్ డే వేడుక‌ల ఫోటోలు చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

 

 

ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన చిరు

చిరంజీవి (Chiranjeevi) పుట్టిన‌రోజు ఆగ‌స్టు 22. ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు, అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా చిరుకు శుభాకాంక్ష‌లు తెలిపారు. చిరంజీవి త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌తీ ఒక్క‌రికీ ధ‌న్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు.

త‌న పుట్టిన రోజున త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి న‌గ‌రానికి దూరంగా ఉన్న ఓ అద్భుత‌మైన ప్ర‌దేశానికి వెళ్లాన‌ని తెలిపారు. పుట్టిన రోజు వేడుక‌ల ఫోటోల‌ను షేర్ చేశారు. ఈ వేడుక‌ల్లో చిరు భార్య సురేఖ‌, కొడుకు రామ్ చ‌ర‌ణ్, కోడ‌లు ఉపాస‌న‌, కూతురు శ్రీజ ఉన్నారు. వీరితో పాటు అల్లు అర‌వింద్ కుటుంబ స‌భ్యులు కూడా ఉన్నారు. 

 

కోడ‌లి విష‌స్

చిరంజీవి (Chiranjeevi) బ‌ర్త్ డే వేడుక‌ల‌ను ఎంతో ఘ‌నంగా జ‌రిపామంటూ కోడలు ఉపాస‌న ట్వీట్ చేశారు. మామ‌య్య బ‌ర్త్ డే రోజున ఫుల్ బిజీగా ఉన్నామ‌ని తెలిపారు. అంద‌రం క‌లిసి ఎంతో ఎంజాయ్ చేశామ‌న్నారు. బిజీ కార‌ణంగా తాను సోష‌ల్ మీడియాలో లేట్‌గా పోస్ట్ పెట్టానంటూ ఉపాస‌న వివ‌ర‌ణ ఇచ్చారు. 

Read More: Godfather Teaser: దుమ్ము రేపుతున్న 'గాడ్ ఫాదర్' టీజర్.. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు పూనకాలే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!