Pushpa 2: ప్ర‌భాస్ కంటే అల్లు అర్జున్ (Allu Arjun) రెమ్యూన‌రేష‌న్ ఎక్కువ‌ట‌.. త‌గ్గేదేలే అంటున్న పుష్ప‌రాజ్

Updated on Sep 08, 2022 08:15 PM IST
 అల్లు అర్జున్  (Allu Arjun) రెమ్యూన‌రేష‌న్ ప్ర‌భాస్ కంటే ఎక్కువ‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.
అల్లు అర్జున్ (Allu Arjun) రెమ్యూన‌రేష‌న్ ప్ర‌భాస్ కంటే ఎక్కువ‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Pushpa 2: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప' సినిమా త‌రువాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రిలీజ్ అయిన 'పుష్ప' ప‌లు రికార్డుల‌ను క్రియేట్ చేసింది. మ‌రీ ముఖ్యంగా అల్లు అర్జున్‌కు నార్త్ ఇండియాలో ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో పెరిగింది. 'పుష్ప 2' షూటింగ్ కోసం అల్లు అర్జున్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ సినిమా కోసం బ‌న్ని భారీగా రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌భాస్ కంటే ఎక్కువగా అల్లు అర్జున్ రెమ్యూన‌రేష‌న్ ఉంద‌ట‌.

రూ. 100 కోట్ల‌కు మించి రెమ్యూన‌రేష‌నా!

'బాహుబ‌లి' త‌రువాత  ప్రభాస్ (Prabhas) రెమ్యూన‌రేష‌న్ భారీగా పెంచేశారు. డార్లింగ్ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లు తీసుకుంటున్నార‌ని టాక్. అల్లు అర్జున్ రెమ్యూన‌రేష‌న్ ప్ర‌భాస్ కంటే ఎక్కువ‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ లెక్క‌న అల్లు అర్జున్ (Allu Arjun) రెమ్యూన‌రేష‌న్ రూ. 100 కోట్లు కంటే ఎక్కువే ఉంటుందిగా. 

 అల్లు అర్జున్  (Allu Arjun) రెమ్యూన‌రేష‌న్ ప్ర‌భాస్ కంటే ఎక్కువ‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

బ‌న్నికి భారీ రెమ్యూన‌రేష‌న్

Pushpa 2: సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న 'పుష్ప- ది రూల్'  సినిమాలో అల్లు అర్జున్ హీరోగా న‌టించ‌నున్నారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రూ. 125 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకోనున్నార‌ట‌. అదే విధంగా  'ఆదిపురుష్' సినిమా కోసం ప్ర‌భాస్ రూ. 120 కోట్ల వరకూ రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నార‌నే వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో అల్లు అర్జున్ 'పుష్ప 2' కోసం ప్ర‌భాస్ కంటే ఎక్కువ‌ రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. 

అల్లు అర్జున్ న‌టించ‌నున్న 'పుష్ప - ది రూల్' సినిమా షూటింగ్‌కు ఇటీవ‌లే ముహుర్తం కూడా ఖ‌రారు చేశారు. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకి సంగీతం స‌మ‌కూర్చ‌నున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడిగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తున్నారు.

Read More: Pushpa 2: 'పుష్ప 2 ' షూటింగ్ గురించి తీపి క‌బురు చెప్పిన రష్మిక (Rashmika Mandanna)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!