Pushpa 2: 'పుష్ప 2 ' షూటింగ్ గురించి తీపి క‌బురు చెప్పిన రష్మిక (Rashmika Mandanna)!

Updated on Sep 07, 2022 12:40 PM IST
 'గుడ్ బై' ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్లో 'పుష్ప 2' సినిమాపై తీపి క‌బురు చెప్పారు ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) .
'గుడ్ బై' ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్లో 'పుష్ప 2' సినిమాపై తీపి క‌బురు చెప్పారు ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) .

Pushpa: సౌత్ స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) న‌టించిన 'పుష్ప' సినిమా ఓ రేంజ్‌లో స‌క్సెస్ సాధించిన సంగ‌తి తెలిసిందే. 'పుష్ప' సినిమా త‌రువాత ర‌ష్మిక మంద‌న్న ఉత్తరాదిలో మరింత పాపుల‌ర్ అయ్యారు. ఇప్పుడు ర‌ష్మిక మంద‌న్న 'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. 'గుడ్ బై' ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్లో 'పుష్ప 2' సినిమాపై తీపి క‌బురు చెప్పారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

పుష్ప షూటింగ్ ఎప్పుడంటే..

ర‌ష్మిక మంద‌న్న  (Rashmika Mandanna) బాలీవుడ్‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. 'గుడ్ బై' సినిమాతో నార్త్ ప్రేక్ష‌కుల‌కు చేరువ కానున్నారు.ఇటీవ‌లే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్ తాజాగా ట్రైల‌ర్‌ను లాంచ్ చేశారు. బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి ఈ చిత్రంలో ర‌ష్మిక న‌టించారు. వికాస్ బల్ ద‌ర్శ‌క‌త్వంలో 'గుడ్ బై' సినిమా విడుద‌ల కానుంది. మాన‌వ సంబంధాల విలువను తెలుపుతూ, మ‌న‌సుకు హ‌త్తుకునే ఓ వైవిధ్యమైన క‌థ‌గా 'గుడ్ బై' సినిమాను దర్శ‌కుడు తెర‌కెక్కించారు. 

'గుడ్ బై' ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌లో ర‌ష్మిక మంద‌న్న 'పుష్ప‌ 2' సినిమాపై ఓ లేటెస్ట్ అప్‌డేట్ రివీల్ చేశారు. 'పుష్ప 2' సినిమా మరో రెండు రోజుల్లో సెట్స్ పైకి వెళుతుంద‌ని చెప్పారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ గురించి ఎదురుచూస్తున్న అభిమానుల‌కు ఈ విధంగా శుభవార్త తెలిపారు రష్మిక. 'అమితాబ్ బ‌చ్చ‌న్ గారితో న‌టించ‌డం నా క‌ల.. అది 'గుడ్ బై' సినిమాతో నిజ‌మైంది' అంటూ తన మదిలోని మాటలను అభిమానులతో పంచుకున్నారు రష్మిక

నిజమైన బాలీవుడ్ కల

గతంలో రష్మిక మందాన్న (Rashmika Mandanna) గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు లాంటి టాలీవుడ్ సినిమాలలో నటించి, దక్షిణాదిలో తన అభిమాన గణాన్ని పెంచుకున్నారు. కన్నడ భామ అయినప్పటికీ కూడా, తెలుగులో అనతికాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. 'పుష్ప' సినిమాతో ఉత్తరాదిలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండరీ నటుడి పక్కన నటించే అవకాశాన్ని కొట్టేశారు. మరి తొలిసారిగా ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న రష్మికను అక్కడి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాల్సిందే

Read More: 'గుడ్‌బై'తో ర‌ష్మిక బాలీవుడ్ ఎంట్రీ!.. బిగ్ బి, ర‌ష్మిక (Rashmika Mandanna)ల ఫ‌స్ట్ లుక్ రిలీజ్ 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!