Allu Arjun: అల్లు అర్జున్ లుక్ 'అద‌ర‌హో' అంటున్న అభిమానులు

Updated on Jul 24, 2022 03:19 PM IST
Allu Arjun: అల్లు అర్జున్ బ్లాక్ డ్రెస్‌లో 'బ్లాక్ అండ్ వైట్' ఫోటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. అల్లు అర్జున్  'పుష్ప 2'లో న‌టిస్తున్నారు.
Allu Arjun: అల్లు అర్జున్ బ్లాక్ డ్రెస్‌లో 'బ్లాక్ అండ్ వైట్' ఫోటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ 'పుష్ప 2'లో న‌టిస్తున్నారు.

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప' సినిమా త‌ర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారారు. 'పుష్ప‌'లో అల్లు అర్జున్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. పుష్ప‌రాజుగా ఈ యంగ్ హీరో ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ త‌న ఫాలోయింగ్ పెంచుకున్నాడు. అల్లు అర్జున్ త‌న ఫ్యాన్స్ కోసం ఓ ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

కొత్త లుక్‌లో క‌నిపించిన అల్లు అర్జున్

అల్లు అర్జున్ బ్లాక్ డ్రెస్‌లో 'బ్లాక్ అండ్ వైట్' ఫోటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్‌లో క‌నిపించారు. అల్లు అర్జున్ లుక్ సూప‌ర్ అంటూ.. ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ముంబైకి చెందిన సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఫోటో షూట్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) పాల్గొన్నారు. అల్లు అర్జున్ సెలెబ్రిటీ ఫోటో షూట్ కోసం ఫోజులు ఇచ్చారు. బ‌న్ని బ్లాక్ టీ ష‌ర్టు వేసుకున్నారు. కొత్త లుక్‌లో క‌నిపించారు. ఆ ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

 

Allu Arjun: అల్లు అర్జున్ బ్లాక్ డ్రెస్‌లో 'బ్లాక్ అండ్ వైట్' ఫోటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

ఆగ‌స్టు త‌ర్వాత‌ పుష్ప 2 షూటింగ్

ప్ర‌స్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప' చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న‌ 'పుష్ప 2'లో న‌టిస్తున్నారు. ఆగ‌స్టు త‌ర్వాత 'పుష్ఫ 2' సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్నారు. అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్  రూ. 350 కోట్లతో నిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'పుష్ప 2' లో ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నార‌ని టాక్. సునీల్, అన‌సూయల‌తో పాటు విజ‌య్ సేతుప‌తి 'పుష్ఫ 2'లో న‌టించ‌నున్నారు. 

Read More : The South Swag: 'ఇండియా టుడే మ్యాగజైన్' పై అల్లు అర్జున్ (Allu Arjun) ఫోటో !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!