'పుష్పరాజు'ను గుర్తు ప‌ట్టారా?..యాడ్ ఫిలిమ్‌లో అద‌ర‌గొట్టిన హీరో (Allu Arjun)

Updated on Jul 30, 2022 03:22 PM IST
ద‌ర్శ‌కులు త్రివిక్ర‌మ్‌, హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో అల్లు అర్జున్ (Allu Arjun)  న‌టించారు.
ద‌ర్శ‌కులు త్రివిక్ర‌మ్‌, హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించారు.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  (Allu Arjun) కొత్త లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఓ యాడ్ ఫిలిమ్ కోసం అల్లు అర్జున్ స్టైలిష్ లుక్‌లో క‌నిపించారు. క‌ళ్ల‌కు కూలింగ్ గ్లాసెస్, చెవికి రెండు పోగులు.. సిగార్ కాలుస్తూ మాస్ లుక్‌లో బ‌న్ని అద‌రిపోయారు. రెడ్ ష‌ర్ట్‌.. బ్లాక్ కోట్‌లో క‌నిపించారు. అల్లు అర్జున్ ప‌లు బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో అల్లు అర్జున్ కొత్త లుక్‌ను చూసిన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

యాడ్ కోసం అల్లు అర్జున్ కొత్త లుక్

ద‌ర్శ‌కులు త్రివిక్ర‌మ్‌, హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో అల్లు అర్జున్ న‌టించారు. అల్లు అర్జున్  (Allu Arjun) ట్విట్ట‌ర్‌లో త‌న కొత్త లుక్‌ను పోస్ట్ చేశారు. ఆ ఫోటోను చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 'వెరైటీ గెట‌ప్‌లో బ‌న్ని' అంటూ కామెంట్లు పెడుతున్నారు. పుష్ప 2 కోసం ఈ లుక్ క‌రెక్ట్‌గా స‌రిపోతుందంటున్నారు. 

అల్లు అర్జున్ (Allu Arjun) ప‌లు ప్ర‌ముఖ బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్‌గా ఉన్నారు. 'ఆహా', 'OLX', 'Colgate', 'రాపిడో', 'జొమాటో' వంటి యాడ్స్‌లో న‌టించారు. గ‌తంలో స్టార్ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించారు. అల్లు అర్జున్ ప్ర‌స్తుతం 'పుష్ప' సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న‌ 'పుష్ప: ది రైజ్‌'లో న‌టించ‌నున్నారు. 

ఆగ‌స్టు త‌ర్వాత‌ పుష్ప 2 షూటింగ్

ప్ర‌స్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప' చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న‌ 'పుష్ప 2'లో న‌టిస్తున్నారు. ఆగ‌స్టు త‌ర్వాత 'పుష్ఫ 2' సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్నారు. అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్  రూ. 350 కోట్లతో నిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'పుష్ప 2' లో ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నార‌ని టాక్. సునీల్, అన‌సూయల‌తో పాటు విజ‌య్ సేతుప‌తి 'పుష్ఫ 2'లో న‌టించ‌నున్నారు. 

Read More : The South Swag: 'ఇండియా టుడే మ్యాగజైన్' పై అల్లు అర్జున్ (Allu Arjun) ఫోటో !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!