అల్లు అర్జున్ (Allu Arjun) వాణిజ్య ప్ర‌క‌ట‌న‌కు హ‌రీష్ శంక‌ర్ డైరెక్షన్

Updated on Jul 28, 2022 04:07 PM IST
హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్ని  (Allu Arjun)  ఓ యాడ్‌లో న‌టించారు. పుష్ప స్టార్ గ్రే ష‌ర్ట్‌, కార్గో ప్యాంట్‌తో స్టైలిష్ లుక్‌లో క‌నిపించారు.
హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్ని  (Allu Arjun) ఓ యాడ్‌లో న‌టించారు. పుష్ప స్టార్ గ్రే ష‌ర్ట్‌, కార్గో ప్యాంట్‌తో స్టైలిష్ లుక్‌లో క‌నిపించారు.

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాల‌తో పాటు ప‌లు వాణిజ్య ప్రకటనల్లో న‌టిస్తున్నారు. తాజాగా ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్ని ఓ యాడ్‌లో న‌టించారు. ఆ యాడ్ కోసం సెట్‌కు వెళ్లిన‌ అల్లు అర్జున్ ఫోటోలు, విజువ‌ల్స్ సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. పుష్ప స్టార్ గ్రే ష‌ర్ట్‌, కార్గో ప్యాంట్‌తో స్టైలిష్ లుక్‌లో క‌నిపించారు. అల్లు అర్జున్ చాలా కూల్‌గా క‌నిపిస్తూ ఉన్న వీడియో చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

యాడ్ కోసం అల్లు అర్జున్ కొత్త లుక్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఓ యాడ్ కోసం హైద‌రాబాద్‌లో షూటింగ్ లొకేష‌న్‌కు వెళ్లారు. ఆ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ను ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. బ‌న్ని న‌టించే యాడ్‌కు ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఛటర్జీ వ‌ర్క్ చేశారు. అల్లు అర్జున్ యాడ్ ఫిల్మ్ త్వరలో విడుదల కానుంది. రీసెంట్‌గా అల్లు అర్జున్ కాస్త బొద్దుగా క‌నిపించిన ఫోటోలు నెట్టింట్లో క‌నిపించాయి. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ స్లిమ్ లుక్‌లో అద‌ర‌గొడుతున్నారు. స్టైలిష్ వాక్‌తో ఫుల్ జోష్‌తో క‌నిపించారు. అల్లు అర్జున్, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో 'దువ్వాడ జ‌గ‌న్నాథం' సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమా 2017లో రిలీజ్ అయింది.  

అల్లు అర్జున్ (Allu Arjun) ప‌లు ప్ర‌ముఖ బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్‌గా ఉన్నారు. 'ఆహా', 'OLX', 'Colgate', 'రాపిడో', 'జొమాటో' వంటి యాడ్స్‌లో న‌టించారు. గ‌తంలో స్టార్ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించారు. అల్లు అర్జున్ ప్ర‌స్తుతం 'పుష్ప' సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న‌ 'పుష్ప: ది రైజ్‌'లో న‌టించ‌నున్నారు. 

ఆగ‌స్టు త‌ర్వాత‌ పుష్ప 2 షూటింగ్

ప్ర‌స్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప' చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న‌ 'పుష్ప 2'లో న‌టిస్తున్నారు. ఆగ‌స్టు త‌ర్వాత 'పుష్ఫ 2' సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్నారు. అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్  రూ. 350 కోట్లతో నిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'పుష్ప 2' లో ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నార‌ని టాక్. సునీల్, అన‌సూయల‌తో పాటు విజ‌య్ సేతుప‌తి 'పుష్ఫ 2'లో న‌టించ‌నున్నారు. 

Read More : The South Swag: 'ఇండియా టుడే మ్యాగజైన్' పై అల్లు అర్జున్ (Allu Arjun) ఫోటో !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!