హ‌ద్దులు లేని ప్రేమాభిమానాల‌కు కృత‌జ్ఞ‌త‌లు - నాగార్జున‌ (Nagarjuna)

Updated on Aug 30, 2022 04:30 PM IST
నాగార్జున (Nagarjuna) బ‌ర్త్ డే రోజున స్నేహితులు, అభిమానులు  విష‌స్ తెలిపారు. ప్ర‌తీ ఒక్క‌రికి థ్యాంక్యూ అంటూ నాగ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
నాగార్జున (Nagarjuna) బ‌ర్త్ డే రోజున స్నేహితులు, అభిమానులు విష‌స్ తెలిపారు. ప్ర‌తీ ఒక్క‌రికి థ్యాంక్యూ అంటూ నాగ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున‌ (Nagarjuna) త‌న‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌తీ ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. నాగార్జున‌ సోష‌ల్ మీడియా ద్వారా ఓ స్పెష‌ల్ వీడియో పోస్ట్ చేశారు. ఈ సంవ‌త్స‌రం త‌న‌కు చాలా ప్ర‌త్యేక‌మైంద‌న్నారు. త‌న పుట్టిన రోజు త‌రువాత రెండు సినిమాల‌తో పాటు ఓ టీవీ షోతో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచేందుకు సిద్ధంగా ఉన్నార‌న్నారు.

థ్యాంక్యూ అంటూ నాగ్ స్పెష‌ల్ వీడియో

నాగార్జున (Nagarjuna) పుట్టిన‌రోజు ఆగ‌స్టు 28. టాలీవుడ్ మ‌న్మ‌థుడు 62 ఏళ్లు పూర్తి చేసుకుని.. 63 వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టారు. నాగార్జున బ‌ర్త్ డే రోజున స్నేహితులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా విష‌స్ తెలిపారు. త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌తీ ఒక్క‌రికి థ్యాంక్యూ అంటూ నాగ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. త‌న పుట్టిన‌రోజు త‌రువాత 'బిగ్ బాస్‌ సీజ‌న్ 6 తెలుగు', 'ది ఘోస్ట్', 'బ్ర‌హ్మాస్త్రం' సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచ‌నున్నాన‌ని నాగ్ తెలిపారు. ఇటీవ‌ల విడుద‌లైన‌ 'ది ఘోస్ట్' సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింద‌న్నారు. 

నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 6 తెలుగు సెప్టెంబ‌ర్ 4 నుంచి స్టార్ మాలో ప్ర‌సారం కానుంది. బాలీవుడ్ సినిమా 'బ్ర‌హ్మాస్త్ర' తెలుగులో 'బ్ర‌హ్మ‌స్రం' పేరుతో సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కానుంది. 'బ్ర‌హ్మాస్త్రం'లో నాగార్జున  పురావస్తు శాఖ నిపుణుడు అజయ్‌ విశిష్ఠ్‌ పాత్రలో కనిపించనున్నారు.  విశ్వ ర‌హ‌స్యాలను చేధించే క్రమంలో నాగార్జున పోరాటం ఎవ‌రిపైన‌?. శివుడి గురించి ఈ చిత్రంలో ఏం చెప్ప‌ద‌లుచుకున్నారో తెలియాలంటే 'బ్ర‌హ్మాస్త్రం' సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే.

ది ఘోస్ట్‌లో మ‌హేష్ న‌టించారా?.

కింగ్ నాగార్జున (Nagarjuna) న‌టించిన 'ది ఘోస్ట్' సినిమా ట్రైల‌ర్‌ను రీసెంట్‌గా మ‌హేష్ బాబు విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా మ‌హేష్ బాబుకు నాగార్జున కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ త‌న‌తో క‌లిసి సినిమా చేస్తామా అంటూ  మ‌హేష్‌ను అడిగారు. అందుకు మ‌హేష్ క‌చ్చితంగా చేస్తానంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వెనుక‌ ట్విస్ట్ ఉందంటూ నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

'ది ఘోస్ట్' సినిమాలో మ‌హేష్ బాబు స్పెష‌ల్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారా అనే అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. 'ది ఘోస్ట్‌'లో నాగార్జున‌తో క‌లిసి మ‌హేష్ బాబు న‌టించారో లేదో తెలియాలంటే అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు ఆగాల్సిందే. 

Read More: Mahesh Babu: "మ‌హేష్ బాబూ.. మ‌నం కూడా మీ నాన్న‌గారి ఐడియాను ఫాలో అవుదామా" : నాగార్జున‌ (Nagarjuna)

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!