The Ghost : 'ది ఘోస్ట్' ట్రైల‌ర్ రిలీజ్ చేసిన మ‌హేష్ బాబు(Mahesh Babu)

Updated on Aug 25, 2022 06:41 PM IST
The Ghost : 'ది ఘోస్ట్' సినిమాతో మ‌రోసారి నాగార్జున ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేయ‌నున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌యింది.
The Ghost : 'ది ఘోస్ట్' సినిమాతో మ‌రోసారి నాగార్జున ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేయ‌నున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌యింది.

The Ghost: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ( Nagarjuna) న‌టించిన 'ది ఘోస్ట్' చిత్రం నుంచి ట్రైల‌ర్ రిలీజ్ అయింది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. మ‌హేష్ బాబు త‌న  సోష‌ల్ మీడియా ద్వారా 'ది ఘోస్ట్' ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.  ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబ‌ర్ 5 తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.  'ది ఘోస్ట్' ట్రైలర్ రిలీజ్ చేయ‌డం సంతోషంగా ఉంద‌ని మ‌హేష్ బాబు తెలిపారు. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 

సస్పెన్స్గా సాగిన ట్రైల‌ర్

'ది ఘోస్ట్' (The Ghost) సినిమాలో సోనాల్‌ చౌహాన్‌ కథానాయికగా న‌టించారు. ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నాగార్జున 'ది ఘోస్ట్' చిత్రంలో అద‌ర‌గొట్ట‌నున్నారు. ఓ త‌ల్లీ కూతుళ్ల‌ను కాపాడే ప్ర‌య‌త్నంలో నాగార్జున ఎదుర్కొన్న స‌వాళ్లు ఆస‌క్తిక‌రంగా క‌నిపించాయి. నాగార్జున్ ఫైట్స్ సినిమాకు హైలెట్ కానున్నాయి. సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా 'ది ఘోస్ట్' విడుద‌ల కానుంది. 

నాగార్జున న‌టించిన 'వైల్డ్ డాగ్' స‌స్పెన్స్ థిల్ల‌ర్ జోన్‌లో ఇటీవ‌ల రిలీజ్ అయింది. కోవిడ్ కార‌ణంగా ఈ సినిమా అనుకున్నంత స‌క్సెస్ కాలేదు. కానీ ఆ సినిమాలో నాగార్జున న‌ట‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. 'ది ఘోస్ట్' సినిమాతో మ‌రోసారి నాగార్జున ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేయ‌నున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుగుతున్నాయి. సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌ రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. 

Read More: 'లైగర్' థియేటర్లలో నాగార్జున (Nagarjuna) 'ది ఘోస్ట్' సినిమా ట్రైలర్ హంగామా..నాగ్ ఈజ్ బ్యాక్ అంటున్న అభిమానులు!

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!