కొత్తదనానికి కేరాఫ్‌ అడ్రస్‌ టాలీవుడ్‌ కింగ్ నాగార్జున (Nagarjuna).. అభిమానుల కోసం బర్త్‌డే స్పెషల్‌ !

Updated on Aug 29, 2022 06:00 PM IST
టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున (Nagarjuna)  ది ఘోస్ట్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు
టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున (Nagarjuna) ది ఘోస్ట్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు

‘శివ’ సినిమాలో  సైకిల్‌ చైన్‌ తెంచి టాలీవుడ్‌లో కొత్త రికార్డు సృష్టించారు అక్కినేని నాగార్జున (Nagarjuna).సినిమా టైటిల్‌ ‘మన్మధుడు’ అని పెట్టి.. ‘అభిరామ్‌’గా అమ్మాయిలపై కోపం చూపించే క్యారెక్టర్‌‌తో నవ్వులు పూయించారు. ’గీతాంజలి’ సినిమాలో ‘ప్రకాశ్‌’గా అభిమానుల కళ్లల్లో నీళ్లు తెప్పించారు.

‘మాస్‌’ హీరోగా అభిమానులను అలరిస్తూనే.. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడిసాయి’ వంటి భక్తిరస చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్ధిర స్థానాన్ని సంపాదించుకున్నారు నాగ్. సోమవారం 63వ పుట్టినరోజు జరుపుకుంటున్న నాగార్జున.. ఇప్పటికీ ఎప్పటికీ టాలీవుడ్‌ మన్మధుడిగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది పింక్‌విల్లా.

బాలనటుడిగా..

1986వ సంవత్సరంలో ‘విక్రమ్’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టారు నాగార్జున. అంతకుముందే అంటే సుమారు 8 నెలల వయసులోనే తండ్రి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన ‘వెలుగు నీడలు’, ‘సుడిగుండాలు’ సినిమాలో బాలనటుడిగా కనిపించారు.

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున (Nagarjuna)  ది ఘోస్ట్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు

గెస్ట్ క్యారెక్టర్‌‌లో..

‘త్రిమూర్తులు’, ‘రావుగారి ఇల్లు’, ‘ఘటోత్కచుడు’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘స్టైల్‌’, ‘తకిట తకిట’, ‘దొంగాట’, ‘అఖిల్‌’, ‘సైజ్‌ జీరో’, ‘ప్రేమమ్‌’ సినిమాల్లో గెస్ట్‌ క్యారెక్టర్లు చేశారు. తెలుగుతోపాటు హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించారు నాగ్‌ (Nagarjuna).

40 మంది కొత్త డైరెక్టర్లు..

ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటారు నాగ్.  తన 36 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 40 మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.  ‘కొత్తవారు దర్శకత్వం వహిస్తే సినిమాకి కొత్తదనం వస్తుంది. నా క్యారెక్టర్లు కూడా కొత్తగా అనిపిస్తాయి. నటనలోనూ కూడా ఓ వైవిధ్యం కనిపిస్తుంది. అందుకే కొత్త దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తుంటాను. ఈ రోజు ఇంత పెద్ద స్టార్‌ని అయ్యానంటే దానికి కారణం కొత్త దర్శకులు, వారి ఆలోచనలే అని చెప్తారు నాగార్జున.

ఒకే ఏడాదిలో విభిన్న పాత్రలతో..

ఒకే ఏడాదిలో ‘గ్రీకువీరుడు’లా సాఫ్ట్‌గా కనిపించడంతో పాటు, ‘జగద్గురు ఆది శంకర’లో కీలకపాత్రలో, ‘భాయ్‌’గా సరికొత్త లుక్‌లో కనిపించారు నాగ్ (Nagarjuna). శిరిడిసాయి సినిమాలో ‘ఒక్కడే దేవుడు’ అంటూ మెసేజ్ ఇచ్చినా, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో ‘డిక్క డిక్క డుం డుం’ అనే పాటకు స్టెప్పులు వేసిన నాగ్.. నిర్మలా కాన్వెంట్‌ సినిమాలో ‘కొత్త కొత్త భాష’, ‘లడ్డుండా’ పాటలతో గాయకుడిగానూ అభిమానులను అలరించారు.   అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌‌పై  ‘ఉయ్యాలా జంపాలా’, ‘నిర్మలా కాన్వెంట్‌’, ‘రంగుల రాట్నం’ వంటి చిన్న సినిమాలను తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్నారు.

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున (Nagarjuna)  ది ఘోస్ట్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు

కో స్టార్లతో సినిమాలు..

కెప్టెన్‌ నాగార్జున, అరణ్యకాండ సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్‌తో, కిరాయి దాదా, సిద్ధార్థ చిత్రాలో రెబల్‌స్టార్ కృష్ణంరాజుతో, ప్రేమయుద్ధం, అధిపతి సినిమాల్లో మోహన్‌బాబుతో, వారసుడు, రాముడొచ్చాడులో సూపర్‌‌స్టార్‌‌ కృష్ణతో, సీతారామరాజులో హరికృష్ణతో, రావోయి చందమామలో జగపతిబాబుతో, కృష్ణార్జున సినిమాలో మంచు విష్ణుతో, ఊపిరిలో కార్తితో, దేవదాస్‌ సినిమాలో నేచురల్‌ స్టార్‌‌ నానితో కలిసి నటించారు నాగార్జున. మహేష్‌బాబుతోనూ నటించేందుకు కూడా రెడీ అంటూ ఇటీవలే సోషల్ మీడియాలో కూడా చెప్పారు నాగ్. దానికి మహేష్‌ కూడా సానుకూలంగానే స్పందించారు.  

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున (Nagarjuna)  ది ఘోస్ట్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు

ఫ్యామిలీ మెంబర్స్‌తో..

కలెక్టర్‌గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు, ఇద్దరూ ఇద్దరే, శ్రీరామదాసు సినిమాల్లో తండ్రి నాగేశ్వరరావుతో,  మనం సినిమాలో నాగేశ్వరరావు, నాగచైతన్య, అఖిల్‌తో.. బంగార్రాజులో నాగచైతన్యతో, స్నేహమంటే ఇదేరా చిత్రంలో సుమంత్‌తో కలిసి నటించారు నాగ్ (Nagarjuna). అటు తండ్రి, ఇటు కొడుకులతో కలిసి నటించే చాన్స్‌ టాలీవుడ్‌లో నాగార్జునకే దక్కింది.

వెండితెరపై హీరోగానే కాకుండా  ‘బిగ్‌బాస్‌’ హోస్ట్‌గా బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు నాగార్జున. వరుసగా మూడు సీజన్లకు (బిగ్‌బాస్‌ 3,4,5)హోస్ట్‌గా వ్యవహరించారు. ‘ఓటీటీ బిగ్‌బాస్‌’ షో హోస్ట్‌గా కూడా సందడి చేశారు. త్వరలోనే ‘బిగ్‌బాస్‌ 6’తో అలరించడానికి రెడీ అవుతున్నారు నాగార్జున.  

తాను నిర్మించిన ‘యువ’ అనే సీరియల్‌లో కూడా నాగార్జున నటించారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్‌ హోస్ట్‌గా కూడా ప్రేక్షకులను ఆకర్షించారు నాగ్.  

సినిమాను త్వరగా పూర్తి చేసి తొందరగా రిలీజ్ చేసే నాగార్జున ఈ ఏడాది జనవరిలో ‘బంగార్రాజు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలోనే ‘ది ఘోస్ట్‌’  సినిమాతో రాబోతున్నారు.

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ది ఘోస్ట్‌  యాక్షన్‌ థ్రిల్లర్ దసరా కానుకగా అక్టోబరు 5న విడుదల కానుంది. రణ్‌బీర్‌ కపూర్ హీరోగా నటించిన ‘బ్రహ్మాస్త్రం-1’ సినిమాలో  నాగ్‌ (Nagarjuna) కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా సెప్టెంబరు 9న రిలీజ్‌ అవుతోంది.  

Read More : టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమా ట్రైలర్‌‌పై రియాక్టైన కాజల్‌ అగర్వాల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!