మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్‌ఫాదర్’ టైటిల్ సాంగ్‌ లిరికల్ వీడియో .. మ్యూజిక్ అదిరింది

Updated on Oct 06, 2022 03:33 PM IST
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన గాడ్‌ఫాదర్ సినిమా మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ హీరోగా చేసిన లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన గాడ్‌ఫాదర్ సినిమా మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ హీరోగా చేసిన లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ చేస్తున్న సినిమా గాడ్‌ఫాద‌ర్‌ (Godfather). మోహ‌న్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌‌ 5వ తేదీన విడుదల కానుంది. మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కి సూపర్‌‌హిట్ అయిన లూసిఫర్‌‌ సినిమాకు రీమేక్‌గా గాడ్‌ఫాదర్ సినిమా రూపొందింది.

గాడ్‌ఫాదర్ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ కీలకపాత్ర పోషించారు. లేడీ సూపర్‌‌స్టార్ నయనతార, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ, గెటప్‌ శీను ముఖ్యపాత్రలు పోషించారు. ఆచార్య తర్వాత చిరంజీవి నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన గాడ్‌ఫాదర్ సినిమా మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ హీరోగా చేసిన లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది

ఫస్ట్‌ లుక్‌ నుంచి పెరిగిన అంచనాలు..

గాడ్‌ఫాదర్ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్, పాటలు, టీజర్, గ్లింప్స్  సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ముఖ్యంగా టీజర్‌‌, ట్రైలర్‌‌లో చిరంజీవి లుక్స్, ఆయన చెప్పిన డైలాగులు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. అంతేకాదు.. తార్‌‌మార్‌‌ తక్కర్‌‌మార్ పాటకు చిరు, సల్మాన్‌ఖాన్ వేసిన స్టెప్పులు నెట్టింటిని షేక్ చేశాయి. ఇక,  అనంతపురంలో ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గాడ్‌ఫాదర్ సినిమా గురించి చిరంజీవి చేసిన కామెంట్లు, చెప్పిన డైలాగ్‌ ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది.

తాజాగా గాడ్‌ఫాదర్ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ లిరికల్ వీడియోను మేకర్స్ ఇటీవలే విడుదల చేశారు. ఈ పాట లిరిక్స్, మ్యూజిక్‌ అద్భుతంగా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌ గాడ్‌ఫాదర్ (GodFather) సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్‌‌గుడ్‌ ఫిలింస్‌  సంయుక్తంగా తెరకెక్కించాయి.

Read More : ‘ఆచార్య’ విషయంలో అదొక్కటే బాధ.. సినిమా ఫెయిల్యూర్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!