‘గాడ్‌ఫాదర్‌’‌ (GodFather) సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే చాన్స్ ఉంది: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

Updated on Oct 06, 2022 11:54 PM IST
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన గాడ్‌ఫాదర్ (GodFather) సినిమా తెలుగుతోపాటు హిందీలో కూడా విడుదల కానుంది
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన గాడ్‌ఫాదర్ (GodFather) సినిమా తెలుగుతోపాటు హిందీలో కూడా విడుదల కానుంది

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఎంత జోష్‌తో సినిమాలు చేసేవారో అదే జోరుతో సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). తాజాగా ఆయన నటించిన గాడ్‌ఫాదర్‌‌ (GodFather) సినిమా రెండు రోజుల్లో విడుదల కానుంది. ఆచార్య సినిమా రిజల్ట్‌తో నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌ గాడ్‌ఫాదర్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. విజయ దశమి కానుకగా అక్టోబర్‌‌ 5వ తేదీన గాడ్‌ఫాదర్ సినిమా విడుదలవుతోంది.

గాడ్‌ఫాదర్ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్, టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్లను జోరుగా నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఇటీవలే గాడ్‌ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అనంతపురంలో నిర్వహించింది. అది గ్రాండ్‌ సక్సెస్‌ అయిన విషయం కూడా తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన గాడ్‌ఫాదర్ (GodFather) సినిమా తెలుగుతోపాటు హిందీలో కూడా విడుదల కానుంది

ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత..

గాడ్‌ఫాదర్‌‌ సినిమాలోని ఒక కీలకపాత్రలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ నటించారు. పొలిటికల్ మాస్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ముంబైలో శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈవెంట్ తర్వాత ముంబైలో మీడియాతో మాట్లాడారు చిరంజీవి.

ఈ సమావేశంలో గాడ్‌ఫాదర్‌‌ సినిమాకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. అందులో ఒక విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. గాడ్‌ఫాదర్‌‌ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే సీక్వెల్‌ను తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని మాత్రమే చెప్పారు తప్ప కన్ఫమ్‌గా చెప్పలేదు. గాడ్‌ఫాదర్ సినిమా రిజల్ట్‌ ప్రకారం సీక్వెల్‌ ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కించిన గాడ్‌ఫాదర్ (GodFather) సినిమాలో నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ, పూరీ జగన్నాథ్, సముద్రఖని కీలకపాత్రల్లో నటించారు. ఎస్‌ఎస్‌ థమన్ సంగీతం అందించారు. మలయాళ స్టార్‌‌ మోహన్‌లాల్‌ హీరోగా తెరకెక్కిన సూపర్‌‌హిట్‌ సినిమా ‘లూసిఫర్’కు రీమేక్‌గా గాడ్‌ఫాదర్ సినిమా రూపొందింది.

Read More : మరో రీమేక్‌కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా! డైరెక్టర్‌‌ను కూడా ఓకే చేశారా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!