అల్లు స్టూడియోస్‌ (Allu Studios)ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

Updated on Oct 07, 2022 12:00 AM IST
అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్‌(Allu Studios)ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రారంభించారు
అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్‌(Allu Studios)ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రారంభించారు

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అల్లు స్టూడియోస్‌ను శనివారం ప్రారంభించారు. అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అల్లు ఫ్యామిలీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రముఖ హాస్యనటులు అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం నిర్మాత అల్లు అరవింద్‌ హైదరాబాద్‌లో నిర్మించిన అల్లు స్టూడియోస్‌ (Allu Studios) ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. 

చిన్న ఆలోచన.. పెద్ద వ్యవస్థ

అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించిన తరువాత మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. ‘మా మావయ్య అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పిస్తున్నాను. అల్లు అరవింద్‌, బన్నీ, శిరీష్‌, బాబీ సినీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. దానికి కారణం కొన్ని దశాబ్దాల క్రితం పాలకొల్లులో అల్లు రామలింగయ్య మదిలో మెదిలిన ఒక చిన్న ఆలోచన. నటనపై ఉన్న ఇష్టంతో మద్రాసు వెళ్లి, నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని వచ్చిన ఆలోచన ఇప్పుడు పెద్ద వ్యవస్థ అయ్యింది.

దానికి కారణమైన అల్లు రామలింగయ్య గారిని ప్రతిక్షణం అల్లు వారసులు  తలచుకుంటూనే ఉండాలి. ఈ స్టూడియో ఒక స్టేటస్‌ సింబల్‌. అల్లు అనే బ్రాండ్‌తో అల్లు రామలింగయ్య పేరును తరతరాలు గుర్తించుకునేలా స్టూడియోను నిర్మించారు. ఈ కుటుంబంలో నేను కూడా భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నానుఉ అని చెప్పుకొచ్చారు చిరంజీవి.

అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్‌(Allu Studios)ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రారంభించారు

డబ్బు కోసం కాదు..

అనంతరం అల్లు అర్జున్‌ (Allu Arjun) మాట్లాడారు. ‘ఈరోజు మా తాతయ్య 100వ పుట్టినరోజు. మాకు చాలా ప్రత్యేకం. అల్లు అరవింద్‌కు అగ్ర నిర్మాణ సంస్థ ఉంది. స్థలాలు ఉన్నాయి. స్టూడియో నిర్మించడం పెద్ద సమస్య కాదని కొందరు అనుకుంటారు. అయితే డబ్బు సంపాదించడం కోసం ఈ స్టూడియోను నిర్మించలేదు. ఇది మా తాతయ్య కోరిక. ఆయన జ్ఞాపకార్థం అల్లు స్టూడియోను నిర్మించాం. ఇక్కడ సినిమా షూటింగ్స్‌ బాగా జరగాలని, పరిశ్రమకు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు అల్లు అర్జున్‌. 

ఈ కార్యక్రమానికి అల్లు ఫ్యామిలీ మెంబర్లతోపాటు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, హాజరయ్యారు. అల్లు రామలింగయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు 

Read More : ప్రతి అభిమానీ గాడ్‌ఫాదరే.. నా వెనుక లక్షల మంది గాడ్‌ఫాదర్స్ ఉన్నారు: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్‌(Allu Studios)ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రారంభించారు

అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్‌(Allu Studios)ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రారంభించారు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!