‘వన్‌ అండ్‌ ఓన్లీ.. ఎస్‌ఎస్‌ రాజమౌళి గారు’.. 'ఆర్ఆర్ఆర్' (RRR) డైరెక్టర్ పై రామ్ చరణ్ (Ram charan) ప్రశంసలు!

Updated on Oct 06, 2022 11:48 PM IST
మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan Tweet) ‘వన్‌ అండ్‌ ఓన్లీ.. ఎస్‌ఎస్‌ రాజమౌళి గారు’ అంటూ పోస్ట్‌ చేశారు.
మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan Tweet) ‘వన్‌ అండ్‌ ఓన్లీ.. ఎస్‌ఎస్‌ రాజమౌళి గారు’ అంటూ పోస్ట్‌ చేశారు.

టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్' RRR (రౌద్రం రణం రుధిరం). టాలీవుడ్ స్టార్ హీరోలయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఈ చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్.. కొమురం భీం పాత్రలో తారక్ తమ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. 

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాకు దేశమే కాదు.. ప్రపంచమే ఫిదా అయ్యాయి. థియేటర్లు, ఓటీటీలో సంచలనం సృష్టించిన ఈ సినిమా.. ఇప్పుడు విదేశాల్లోనూ దూసుకుపోతోంది. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్‏లోగల చైనీస్ థియేటర్ లో 'ఆర్ఆర్ఆర్' సినిమాను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. వివిధ దేశాలలోని ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసి దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరోవైపు.. భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక, పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. 

ఈ క్రమంలో.. లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న బీయాండ్‌ ఫెస్ట్‌లో భాగంగా టీసీఎల్‌ ఛైనీస్‌ థియేటర్‌ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా.. థియేటర్‌లో సినిమాను వీక్షిస్తున్న అక్కడి ప్రేక్షకులు ‘నాటు నాటు’ (Naatu Naatu Song) పాటకు అదిరిపోయే డ్యాన్స్‌తో ఆడిటోరియంను హోరెత్తించారు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి వేదికపై వెళ్లగా అక్కడ ఉన్న ప్రేక్షకులు అందరూ కరతాళ ధ్వనులతో స్టాండింగ్‌ ఓవెషన్‌ ఇచ్చారు.

దీనికి సంబంధించిన వీడియోను లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోను మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan Tweet) ‘వన్‌ అండ్‌ ఓన్లీ.. ఎస్‌ఎస్‌ రాజమౌళి గారు’ అంటూ పోస్ట్‌ చేశారు. చరణ్‌ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Read More: హీరో మోటోకార్ప్‌ (Hero Motocorp) కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ తేజ్‌ (Ram Charan)..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!