రవితేజ (Ravi Teja) ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి మూడో సింగిల్.. ఫుల్‌ లిరికల్ సాంగ్‌ ఎప్పుడంటే?

Updated on Jul 01, 2022 12:44 AM IST
రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాలో మాస్‌ మహారాజా రవితేజ
రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాలో మాస్‌ మహారాజా రవితేజ

కెరీర్‌లో ఎప్పుడూ లేనంత స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారు మాస్ మహారాజా రవితేజ (Ravi Teja). ఏడాదికి రెండు సినిమాల‌ను విడుద‌ల‌ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇక రవితేజ సినిమాల గురించి వ‌స్తున్న అప్‌డేట్స్ ఏ హీరో సినిమాల‌కూ రావ‌డంలేదు. ప్రతి వారం ఏదో ఒక అప్‌డేట్‌తో ర‌వితేజ‌.. అభిమానుల‌ను ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం నాలుగు సినిమాలను పట్టాలెక్కించాడు ఈ మాస్‌ మహారాజా.

ఇటీవ‌లే రవితేజ నటించిన ‘ఖిలాడీ’ సినిమా విడుదలైంది. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అయితే సినిమా హిట్‌ ప్లాప్‌లతో సంబంధం లేకుండా మంచి జోష్‌తో సినిమాలు చేస్తుంటారు మాస్ మహారాజా. ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టి అభిమానులను అలరించాలనే తపనతో పనిచేస్తున్నారు.

ఈ సారి ‘రామారావు ఆన్ డ్యూటీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్లు ఇస్తోంది. తాజాగా మేక‌ర్స్ మ‌రో అప్‌డేట్‌ ఇచ్చారు.

రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాలో మాస్‌ మహారాజా రవితేజ

రెండు పాటలకు మంచి రెస్పాన్స్..

‘రామారావు ఆన్‌ డ్యూటీ’ సినిమాలో నుంచి ఇప్పటికే రిలీజైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో థర్డ్‌ సింగిల్‌ ప్రోమో రిలీజ్‌ చేయనున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. గురువారం సాయంత్రం ఈ సినిమాలోని ‘నా పేరు సీసా’ అనే స్పెషల్ సాంగ్ ప్రోమోను రిలీజ్‌ చేసింది. ఈ పాటకు సంబంధించిన ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ను జూలై 2వ తేదీన రిలీజ్‌ చేయనున్నట్టు ప్రకటించింది.

శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఆర్‌‌టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌‌ చెరుకూరితో కలిసి రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ (Ravi Teja) డిప్యూటీ కలెక్టర్‌‌గా నటిస్తున్న ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రాజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.    

Read More : హీరోగా రవితేజ (Ravi Teja) తమ్ముడి కొడుకు ఎంట్రీ.. దర్శకుడు రమేష్‌ వర్మపైనే భారం వేసిన మాస్‌ మహరాజా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!