వసూళ్ల వర్షం కురిపిస్తున్న మహేష్‌బాబు (MaheshBabu) ‘సర్కారు వారి పాట’ సినిమా.. రూ.200 కోట్లు వసూలు

Updated on Jun 04, 2022 02:26 PM IST
మహేష్‌బాబు (MaheshBabu) ‘సర్కారు వారి పాట’ సినిమా పోస్టర్
మహేష్‌బాబు (MaheshBabu) ‘సర్కారు వారి పాట’ సినిమా పోస్టర్

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu), కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘సర్కారు వారి పా‘ట. ఈ సినిమా ఇటీవలే రిలీజై సూపర్‌‌హిట్ టాక్‌ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సముద్రఖని విలన్‌గా నటించి మెప్పించాడు. ఇండియాతోపాటు ఓవర్సీస్‌లో కూడా ‘సర్కారు వారి పాట‘ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది.

ఈ సినిమా వరల్డ్ వైడ్ ఇప్పటివరకు రూ.106.30 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది.

నైజాం - రూ.32.77 కోట్లు, సీడెడ్ - రూ.11.31 కోట్లు, యూఏ - రూ.12.21 కోట్లు, ఈస్ట్ - రూ.8.35 కోట్లు, వెస్ట్ - రూ.5.51 కోట్లు, గుంటూరు రూ.8.41 కోట్లు, కృష్ణా - రూ.5.73 కోట్లు, నెల్లూరు - రూ.3.41 కోట్లు.

 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ ఆఫీస్ టోటల్ కలెక్షన్స్- రూ.87.70 కోట్లు

 కేఏ+ ఆర్‌‌వోఐ – రూ.6.65 కోట్లు, ఓఎస్ – రూ.12.30 కోట్లు.

ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ కలెక్షన్స్ – రూ.106.65 కోట్లు, గ్రాస్ రూ.171.30 కోట్ల.

మహేష్‌బాబు (MaheshBabu) ‘సర్కారు వారి పాట’ సినిమా పోస్టర్

ఇక, ‘సర్కారు వారి పాట‘ సినిమా విడుదలైన తర్వాత,  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు మహేష్‌బాబు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్రస్తుతం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. త్రివిక్రమ్‌ సినిమా తర్వాత, మహేష్‌ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్‌ కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతానికి తెలియరాలేదు  

సుబ్బరాజు, సముద్రఖని, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలలో నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా యూట్యూబ్‌లో కూడా దుమ్ము రేపుతోంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లోని 'మా మా మహేశా' అనే సెన్సేషనల్ మాస్ సాంగ్ యూట్యూబ్‌లో 50 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసినట్లు సమాచారం. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. మహేష్‌బాబు (MaheshBabu) హీరోగా చేసిన ఈ సినిమాకు ఎస్‌ఎస్‌. థమన్ సంగీతం అందించాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!