మహేష్‌బాబు (MaheshBabu) ‘సర్కారు వారి పాట’ సినిమాపై ఆనంద్ మహీంద్రా కామెంట్స్.. వైరల్

Updated on May 30, 2022 04:43 PM IST
ఆనంద్‌ మహీంద్రా, మహేష్‌బాబు (MaheshBabu)
ఆనంద్‌ మహీంద్రా, మహేష్‌బాబు (MaheshBabu)

సూపర్‌‌స్టార్ మహేష్ బాబు (MaheshBabu), డైరెక్టర్ పరశురాం కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘సర్కారు వారి పాట’ మే 12న విడుదలైన ఘన విజయం సాధించింది. విడుదలైన 12 రోజుల్లోనే రూ.2 వందల కోట్ల గ్రాస్ వసూలు చేసింది. విడుదలైన మొదటిరోజే రూ.75 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. విడుదలైన 12 రోజులకే 2 వందల కోట్ల క్లబ్‌లో చేరింది.

ఈ సినిమాలో మహేష్‌బాబు అందరికీ అప్పులు ఇస్తూ.. వడ్డీలు వసూలు చేసే క్యారెక్టర్‌లో నటించాడు. బడాబాబులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎగ్గొడితే.. సామాన్యుల నుంచి బ్యాంకులు, ప్రభుత్వాలు ఎలా వసూలు చేస్తున్నాయనే కోణంలో పరశురామ్ సినిమాను తెరకెక్కించాడు. తాజాగా ఈ సినిమాపై ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్‌ చేశారు.

సర్కారు వారి పాట సినిమాలో మహేష్‌బాబు (MaheshBabu)

అనుపమ్‌ తరేజా పోస్ట్‌ చేసిన ఓ వీడియోకు స్పందనగా రీట్వీట్‌ చేశారు. ‘అన్‌బీటబుల్‌ కాంబినేషన్‌ అయిన సూపర్​స్టార్‌ మహేష్‌బాబు, జావా మెరూన్‌ (మహీంద్రా కంపెనీ తయారు చేస్తున్న బైక్‌)లను చూడకుండా ఎలా ఉండగలను. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నాను. న్యూ జెర్సీకి వెళ్లి సినిమా ఎక్కడ ప్రదర్శించబడితే అక్కడికి వెళ్లి చూస్తాను’ అంటూ ఆనంద్‌ మహీంద్రా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. విలన్ సముద్రఖనికి వార్నింగ్ ఇవ్వడానికి మహేష్‌బాబు జావా మెరూన్‌ బైక్‌పై వెళతాడు. అంతేకాకుండా మరో రెండు సార్లు సినిమాలో అదే బైక్‌పై కనిపించాడు మహేష్‌.

‘సర్కారు వారి పాట’ సినిమా ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు దక్కించుకుంది. వాస్తవానికి పెద్ద బడ్జెట్ సినిమాలు థియేటర్‌‌లో రిలీజ్ అయిన నెల రోజుల తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయి. కానీ అమెజాన్ ప్రైమ్ మాత్రం అంతకంటే ముందే ‘సర్కారు వారి పాట’ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు ఇప్పటికే సినిమా మేకర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. నిజానికి జూన్‌ 24న ఓటీటీలో విడుదల కావాల్సిన ఈ సినిమా అంతకంటే ముందుగానే జూన్ 10వ తేదీన స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

‘సర్కారు వారి పాట’ మూవీ హిట్ తరువాత మహేష్ బాబు (MaheshBabu) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించనున్నాడు. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ‘అతడు’, ‘ఖలేజా’ మూవీల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో మూవీ తెరకెక్కనుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!