Naga Chaitanya: అదిరిన అక్కినేని నాగ చైతన్య ఫస్ట్ లుక్.. వెంకట్ ప్రభు ‘కస్టడీ’ (Custody)లో చైతూ!
అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) నటిస్తున్న కొత్త చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమాకు కోలీవుడ్ టాప్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈరోజు 36వ పడిలోకి నాగచైతన్య అడుగుపెడుతున్న సందర్భంగా ఈ లుక్‌ను టీమ్ విడుదల చేసింది.
ఫస్ట్ లుక్‌లో నాగ చైతన్య ఇంటెన్స్‌గా కనిపించారు. ఆయనపై పోలీసులు గన్స్ ఎక్కుపెట్టడం, చైతూ తీక్షణంగా చూస్తుండటం ఆయన పాత్ర ఎలా ఉంటుందో అనే ఆసక్తిని పెంచుతోంది. చైతూ కూడా పోలీస్ లుక్‌లోనే ఉండటం.. ఆయనపై ఇతర పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ‘థ్యాంక్యూ’ సినిమా తర్వాత నాగచైతన్య నుంచి వస్తున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. చైతూ కెరీర్‌లో ఇది 22వ చిత్రం కావడం గమనార్హం.
‘థ్యాంక్యూ’ చిత్రం ఆశించినంత విజయం సాధించకపోవడంతో ‘కస్టడీ’పై గంపెడాశలు పెట్టుకున్నారు చైతూ. ఆయన స్పెషల్ రోల్‌లో కనిపించిన ‘లాల్ సింగ్ చద్దా’ కూడా ఫ్లాప్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా హిట్ కొట్టాలని కసి మీద ఉన్నారీ అక్కినేని వారసుడు. యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న ‘కస్టడీ’ (Custody) సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ మూవీలో చైతూ సరసన బబ్లీ బ్యూటీ కృతి శెట్టి మరోమారు హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీళ్లిద్దరూ ఇంతకుముందు ‘బంగార్రాజు’లో జోడీగా అలరించిన సంగతి తెలిసిందే.
ఇకపోతే, నాగ చైతన్య ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కోసం ఆయన దర్శకుడు విక్రమ్ కె.కుమార్‌తో కలసి క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ సిరీస్‌ను మొత్తం 24 నుంచి 30 ఎపిసోడ్‌లతో మూడు సీజన్లుగా తెరకెక్కించనున్నారట. ఇందులో నాగచైతన్య పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందని తెలుస్తోంది. తమిళ నటి ప్రియా భవానీ శంకర్ ఈ సిరీస్‌లో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు.
Read more: Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఉన్న అత్యంత విలువైన టాప్5 వస్తువులు!