The Ghost: 'ది ఘోస్ట్' ప్రీ రిలీజ్ గెస్టులెవ‌రో తెలుసా!.. ఫ్యాన్స్‌కు నాగార్జున (Nagarjuna) స‌ర్‌ప్రైజ్

Updated on Sep 24, 2022 11:37 AM IST
The Ghost: 'గరుడ వేగ' సినిమా త‌రువాత‌ ప్రవీణ్ సత్తారు నాగార్జున (Nagarjuna) తో 'ది ఘోస్ట్' చిత్రాన్ని తెర‌కెక్కించారు.
The Ghost: 'గరుడ వేగ' సినిమా త‌రువాత‌ ప్రవీణ్ సత్తారు నాగార్జున (Nagarjuna) తో 'ది ఘోస్ట్' చిత్రాన్ని తెర‌కెక్కించారు.

The Ghost: టాలీవుడ్ కింగ్  నాగార్జున (Nagarjuna) న‌టించిన‌ 'ది ఘోస్ట్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క‌ర్నూలులో జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా నాగార్జున కుమారులు నాగ‌చైత‌న్య‌, అఖిల్ అక్కినేని హాజ‌రుకానున్నారు. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో అధికారికంగా ప్ర‌క‌టించారు. 'ది ఘోస్ట్' సినిమా ద‌స‌రా పండుగ రోజున రిలీజ్ కానుంది. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో 'ది ఘోస్ట్' సినిమా ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేయ‌నుంది. 

ప్రీ రిలీజ్‌లో స‌ర్‌ప్రేజ్

'గరుడ వేగ' సినిమా త‌రువాత‌ ప్రవీణ్ సత్తారు నాగార్జునతో 'ది ఘోస్ట్' చిత్రాన్ని తెర‌కెక్కించారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా 'ది ఘోస్ట్' సినిమాను చిత్రీక‌రించారు. ఈ సినిమా అక్టోబ‌ర్ 5 న విడుద‌ల కానుంది. ఇటీవ‌ల 'ది ఘోస్ట్' చిత్రం నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, ట్రైల‌ర్లు, పాట‌లకు ప్రేక్ష‌కుల నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో 'ది ఘోస్ట్' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా గ్రాండ్‌గా నిర్వ‌హించ‌నున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌ర్నూలులో సెప్టెంబ‌ర్ 25 తేదీన సాయంత్రం 6 గంట‌ల‌కు ఎస్‌టీబీటీ కాలేజ్ గ్రౌండ్స్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్‌కు నాగ‌చైత‌న్య‌, అఖిల్ ముఖ్య అతిథులుగా హాజ‌రుకానున్నారు.  

ఓ త‌ల్లీ కూతుళ్ల‌ను కాపాడే ప్ర‌య‌త్నంలో నాగార్జున ఎదుర్కొనే స‌వాళ్లు ప్ర‌ధాన అంశంగా ది ఘోస్ట్ (The Ghost) సినిమా క‌థ సాగ‌నుంది. నాగ్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా సోనాల్‌ చౌహాన్ న‌టిస్తున్నారు. నాగార్జున ఫైట్స్ సినిమాకు హైలెట్ కానున్నాయి. సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా 'ది ఘోస్ట్' విడుద‌ల కానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌ రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Read More: The Ghost: 'ది ఘోస్ట్' కోసం నాగార్జున (Nagarjuna) అంత రిస్క్ చేశారా!.. మేకింగ్ వీడియో అదుర్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!