నాగ చైతన్య (Chaitanya Akkineni) మూవీ టీమ్‌పై దాడి?.. షూటింగ్ అనుమతులు రద్దు!

Updated on Oct 13, 2022 01:13 PM IST
 నాగ చైతన్య (Chaitanya Akkineni) చిత్ర యూనిట్ మీద కొందరు గ్రామస్తులు దాడి చేసినట్లు సమాచారం
నాగ చైతన్య (Chaitanya Akkineni) చిత్ర యూనిట్ మీద కొందరు గ్రామస్తులు దాడి చేసినట్లు సమాచారం

అక్కినేని నాగ చైతన్య (Chaitanya Akkineni) హీరోగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కర్ణాటకలోని మాండ్యలో జరుగుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్‌కు ఇచ్చిన అనుమతులను మాండ్య జిల్లా పాలనా యంత్రాంగం రద్దు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా ఈ మూవీ టీమ్‌పై స్థానికులు దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

అసలేం జరిగిదంటే..

కర్ణాటకలోని మాండ్య జిల్లా, మేలుకోటె అనే గ్రామంలో నాగ చైతన్య కొత్త మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. అదే గ్రామంలోని రాయగోపుర దేవాలయం సమీపంలో ఈ మూవీ షూటింగ్‌ సెట్‌ను ఏర్పాటు చేసి కీలక సన్నివేశాలను చిత్రకరిస్తున్నారట. ఈ క్రమంలో దేవాలయం ముందు బార్‌ సెట్‌ వేసినట్లు తెలుస్తోంది. ఇది తెలిసిన గ్రామస్తులు.. చిత్ర యూనిట్‌పై మండిపడ్డారట. గుడి ముందే బార్‌ సెట్‌ వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన గ్రామస్తులు.. మూవీ యూనిట్‌పై దాడి చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలో హీరో నాగచైతన్య కూడా సెట్‌లోనే ఉన్నారని సమాచారం. 

 ఈ చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారట. కాగా, ఈ మూవీ షూటింగ్ కోసం మాండ్య జిల్లా డీసీ అశ్వినీని చిత్ర యూనిట్ అనుమతి కోరగా.. రెండ్రోజుల కింద పర్మిషన్ ఇచ్చారట. కానీ దీన్ని కూడా మూవీ టీమ్ అతిక్రమించిందని కథనాలు వస్తున్నాయి. రెండ్రోజులు దాటిన తర్వాత కూడా చిత్రీకరణను కొనసాగించారని సమాచారం. అలాగే ఈ షూటింగ్‌లో బార్ సీన్ ఉన్నట్లు ముందుగా సమాచారం ఇవ్వలేదనే వాదన కూడా వినిపిస్తోంది. మరి, ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్ర బృందం నుంచి స్పందన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.  

ఇకపోతే, నాగ చైతన్య చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 13 ఏళ్లు కావొస్తోంది. టాలీవుడ్ ​మన్మథుడు నాగార్జున తనయుడిగా 2009లో ‘జోష్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి చైతూ ఎంటరయ్యారు. అక్కినేని కుటుంబం నుంచి హీరో వస్తుండటంతో సినీ అభిమానుల్లో, అక్కినేని ఫ్యాన్స్‌ నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా విడుదలైన తర్వాత అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. కానీ నటుడిగా మాత్రం చైతన్య మెప్పించారు. 

Read more: Naga Chaitanya: నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో .. కొత్త చిత్రం NC22 షూటింగ్ రేపటి నుండే ప్రారంభం!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!