Happy Birthday Naga Chaitanya : నాగ చైతన్య బర్త్ డే స్పెషల్ - సక్సెస్ దిశగా దూసుకెళుతున్న చై..

Updated on Nov 23, 2022 12:31 PM IST
నాగ చైతన్య (Naga Chaitanya) పొగడ్తలకు పొంగిపోకుండా.. విమర్మలుకు కుంగిపోకుండా తన కెరీయర్‌లో ముందుకు సాగుతున్నారు
నాగ చైతన్య (Naga Chaitanya) పొగడ్తలకు పొంగిపోకుండా.. విమర్మలుకు కుంగిపోకుండా తన కెరీయర్‌లో ముందుకు సాగుతున్నారు

టాలీవుడ్ యంగ్ హీరోలలో యువ సామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) తనదైన నటనతో దూసుకెళుతున్నారు. తండ్రి నాగార్జున, తాత ఏఎన్ఆర్ బాటలో కొనసాగుతూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. తన తాత ఏఎన్ఆర్ పాత్రలో 'మహానటి' సినిమాలో కనిపించి అందరినీ మాయ చేశారు చై.

ఈ సంవత్సరం బ్యాక్ టూ బ్యాక్ హిట్లను సాధించి మరింత పాపులర్ అయ్యారు. పొగడ్తలకు పొంగిపోకుండా.. విమర్మలుకు కుంగిపోకుండా తన కెరీయర్‌లో ముందుకు సాగుతున్న నాగ చైతన్య పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా నాగ చైతన్యపై పింక్ విల్లా ప్రత్యేక కథనం మీ కోసం.. 

నాగ చైతన్య (Naga Chaitanya)

నాగ చైతన్య (Naga Chaitanya) 1986 నవంబర్ 23 తేదీన జన్మించారు. అక్కినేని నాగార్జున మొదటి భార్య లక్ష్మి కుమారుడు. నాగచైతన్య అమ్మ లక్ష్మి ప్రముఖ నిర్మాత రామానాయుడు కుమార్తె.

2009లో విడుదలైన 'జోష్' సినిమాతో నాగచైతన్య తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రముఖ రచయిత వాసు వర్మ 'జోష్' చిత్రం ద్వాారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే నాగచైతన్య ఉత్తమ నటుడిగా ఫిలిమ్ ఫేర్, నంది అవార్డులను అందుకున్నారు. 

నాగ చైతన్య (Naga Chaitanya)

2010లో నాగచైతన్య 'ఏ మాయ చేసావె' సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ సాధించారు. ఈ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. నాగచైతన్యకు జోడిగా సమంత నటించారు. 

2011లో సుకుమార్ దర్శకత్వంలో '100% లవ్' సినిమాలో నాగచైతన్య నటించారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించారు. 100% లవ్ చిత్రం కూడా నాగ చైతన్యకు భారీ విజయాన్ని అందించింది. 

నాగచైతన్య (Naga Chaitanya) నటించిన 'దడ', 'బెజవాడ', 'ఆటోనగర్ సూర్య', 'తడాఖ', 'దోచేయ్', 'సవ్యసాచి' చిత్రాలు అనుకున్నంత స్థాయిలో హిట్ అవ్వలేదు

నాగ చైతన్య (Naga Chaitanya)

చై తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జునలో కలిసి నటించిన 'మనం' సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది.

2014లో రిలీజ్ అయిన 'ఒక లైలా కోసం' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు చై. ఈ సినిమాతో హీరోయిన్ పూజా హెగ్డే టాలీవుడ్‌కి పరిచయమైంది. 

2016లో విడుదలైన మలయాళం రీమేక్ సినిమా 'ప్రేమమ్' సినిమాతో హిట్ అందుకున్నాడు నాగచైతన్య. గౌతమ్ మీనన్, చై కాంబోలో తెరకెక్కిన  'సాహసమే శ్వాసగా సాగిపో' ఓ మోస్తరు విజయం సాధించింది. 

నాగ చైతన్య (Naga Chaitanya)

2017లో 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రం నాగచైతన్యకు భారీ విజయం అందించింది. అలాగే. 2018లో విడుదల అయిన 'శైలజారెడ్డి అల్లుడు' కూడా  విజయం సాధించింది. 

2019 నుంచి నాగ చైతన్య సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. సమంతతో నటించిన 'మజిలీ', తన మేనమామ వెంకటేష్‌తో నటించిన 'వెంకీ మామ' సినిమాలు సక్సెస్ సాధించాయి.

2020లో నాగచైతన్య 'లవ్ స్టోరి' సినిమాలో నటించారు. ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడిగా సాయిపల్లవి నటించారు. 

నాగ చైతన్య (Naga Chaitanya)

'ఏ మాయ చేసావె' సినిమాలో తనతో కలిసి నటించిన సమంత ప్రేమలో పడ్డారు నాగచైతన్య. వీరిద్దరు దాదాపు పదేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. ఆ తరువాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరు విడాకులు తీసుకున్నారు.

విడాకులు తరువాత నాగచైతన్య నటించిన 'బంగ్రారాజు' సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. తన తండ్రి నాగార్జునతో కలిసి బంగ్రారాజులో నటించారు చై. ఇక ఆ తరువాత రిలీజ్ అయిన 'థ్యాంక్యూ', 'లాల్ సింగ్ చడ్డా' సినిమాలు కూడా నాగ చైతన్యకు విజయాన్ని అందించాయి. 

నాగ చైతన్య (Naga Chaitanya)

నాగచైతన్య ప్రస్తుతం తన 22 వ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభుతో నటిస్తున్నారు. ఈ సినిమాకు NC22 అనే టెంపరరీ టైటిల్‌ను ఖరారు చేశారు. కానిస్టేబుల్ పాత్రలో చై కనిపించనున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నాగ చైతన్యకు భారీ సక్సెస్ ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు. 

Read More: Lal Singh Chaddha: 'లాల్ సింగ్ చ‌డ్డా'లో బాల‌రాజుగా తాత లుక్‌లో క‌నిపించిన నాగ‌చైత‌న్య (Naga Chaitanya)

నాగ చైతన్య (Naga Chaitanya)

 
 
నాగచైతన్య కొత్త కొత్త పాత్రలతో ప్రేక్షకులకు వినోదం అందించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే చై.
పింక్ విల్లా. 
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!