"థ్యాంక్యూ రివ్యూ" (Thank you Review) : స్వేచ్ఛగా వ‌దిలేయ‌గ‌ల ప్రేమ ఎంతో గొప్ప‌దంటున్న చై (Naga Chaitanya)

Updated on Jul 22, 2022 05:49 PM IST
Thankyou Review : ఒక మ‌నిషిని ప‌ట్టుకుని వేలాడే ప్రేమ‌కంటే.. స్వేచ్చ‌గా వ‌దిలేయ‌గ‌ల ప్రేమ ఎంతో గొప్ప‌ది - నాగచైతన్య (Naga Chaitanya)
Thankyou Review : ఒక మ‌నిషిని ప‌ట్టుకుని వేలాడే ప్రేమ‌కంటే.. స్వేచ్చ‌గా వ‌దిలేయ‌గ‌ల ప్రేమ ఎంతో గొప్ప‌ది - నాగచైతన్య (Naga Chaitanya)

సినిమా - థ్యాంక్యూ (Thank You)
నటీనటులు - నాగ‌చైత‌న్య‌,  రాశీఖ‌న్నా, మాళవికా నాయర్, అవికా గోర్, రావు రమేష్
ద‌ర్శ‌క‌త్వం - విక్ర‌మ్ కె. కుమార్
నిర్మాతలు - దిల్ రాజు, శిరీష్ 
బ్యాన‌ర్ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 
సంగీతం - త‌మ‌న్

సినిమా రేటింగ్ - 3/ 5

ThankYou: అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) న‌టించిన‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘థ్యాంక్యూ’ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. నాగ‌చైత‌న్య 'థ్యాంక్యూ'లో కొత్త పాత్ర‌లో క‌నిపించారు. ఈ సినిమాకు 'మ‌నం' ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శకత్వం వ‌హించారు. 'థ్యాంక్యూ' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  బ్యాన‌ర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు నిర్మించారు. ఈ సినిమా విడుద‌లకు ముందు నుంచి పాజిటివ్ టాక్ న‌డిచింది. 'థ్యాంక్యూ' సినిమా విడుద‌లైన త‌ర్వాత టాక్ ఎలా ఉంది? నాగ‌చైత‌న్య న‌ట‌న గురించి ప్రేక్ష‌కులు ఏమంటున్నారు? మొదలైన విషయాలను మనమూ తెలుసుకుందాం. 

సినిమా క‌థ 
టీనేజ్ నుంచి బిలియనీర్ వ‌ర‌కు సాగిన అభిరామ్ (నాగ చైతన్య) క‌థే 'థ్యాంక్యూ' సినిమా. అభిరామ్ నారాయ‌ణ‌పురం అనే ప‌ల్లెటూరికి చెందిన యువ‌కుడు. అత‌ను చ‌దువుకుని ఉద్యోగరీత్యా అమెరికా వెళ‌తాడు. అమెరికాలో రావు అంకుల్ (ప్రకాష్ రాజ్), ప్రియ (రాశీ ఖన్నా) అభిరామ్‌ను స‌పోర్ట్ చేస్తారు. వైద్య అనే యాప్‌ను అభిరామ్ రూపొందిస్తాడు.

ఆ యాప్ స‌క్సెస్ అవ‌డంతో బిలియ‌నీర్‌గా మార‌తాడు. అభిరామ్, ప్రియ‌లు ప్రేమించుకుంటారు. అభిరామ్ త‌నొక్క‌డి వ‌ల్లే బిజినెస్ స‌క్సెస్ అయింద‌ని న‌మ్ముతాడు. అయితే అభిరామ్ విజ‌యానికి స‌హాయ‌ప‌డినవారు ఎవ‌రో ప్రియ‌ గుర్తు చేస్తుంది. ప్రియ చెప్పిన మాట‌లు అభిరామ్ మ‌న‌సును తాకుతాయి. 

తాను అమెరికా వ‌చ్చే వ‌ర‌కు, త‌న వెంట ఉండి స‌పోర్ట్ చేసిన వారికి 'థ్యాంక్యూ' చెప్పేందుకు అభిరామ్ త‌న సొంత ఊరు వెళ‌తాడు. అభిరామ్‌కు హాకీ ఆట అంటే ఇష్టం. అలాగే కాలేజీ రోజుల్లో పార్వతి (మాళవికా నాయర్)తో ప్రేమలో ప‌డ‌తాడు. ఇక టీనేజ్‌లో శర్వా (సాయి సుశాంత్ రెడ్డి) తో గొడ‌వ‌లు, మ‌హేష్ బాబు అభిమానిగా అభిరామ్ చేసిన సంద‌డి ప్రేక్ష‌కుల‌ను కచ్చితంగా మెప్పిస్తాయి.

ఈ సినిమాలో అవికాగోర్ పాత్ర ఏంటి? అభిరామ్ 'ఒక మ‌నిషిని ప‌ట్టుకుని వేలాడే ప్రేమ‌కంటే.. స్వేచ్ఛగా వ‌దిలేయ‌గ‌ల ప్రేమ ఎంతో గొప్ప‌ది' అని ఎందుకంటాడు? అలాంటి ప్రేమతో నిండిన అభిరామ్ క‌థే 'థ్యాంక్యూ' సినిమా.

చై న‌ట‌న‌
నాగ‌చైత‌న్య (Naga Chaitanya) మూడు వ‌య‌స్సుల్లోనూ అద్భుతంగా న‌టించారు. టీనేజ్, యువ‌కుడు, మ‌ధ్య వ‌య‌స్కుడి పాత్రల్లో నాగ‌చైత‌న్య ఒదిగిపోయారు. పాత్ర‌కు త‌గ్గ న‌ట‌నను క‌న‌బ‌రిచారు. 18 ఏళ్ల కుర్రాడిగా క‌నిపించేందుకు నాగ‌చైత‌న్య చాలా బాగా క‌ష్ట‌ప‌డ్డారు. నాగ‌చైత‌న్య కాస్టూమ్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా మ‌హేష్ బాబు అభిమానిగా 'థ్యాంక్యూ'లో చై న‌టించి పెద్ద సాహ‌స‌మే చేశారు. మాళవిక నాయర్‌తో క‌లిసి న‌టించిన సీన్స్‌లో చై  నటన బాగుంటుంది. ఈ సినిమా సంభాషణలు అర్థవంతంగా ఉన్నాయి.

ద‌ర్శ‌క‌త్వం ఎలా సాగింది ?
ఓ వ్య‌క్తి జీవిత ప్ర‌యాణంలో ఇత‌రుల ప్రోత్సాహం కూడా ఉంటుంద‌ని చెప్పే క‌థ‌గా 'థ్యాంక్యూ' సినిమాను ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె. కుమార్ తెర‌కెక్కించారు.

ఒక‌రిపై ఒక‌రికి ఉండే గౌర‌వం, ప్రేమ వంటి ఎమోష‌న్స్‌‌ను స్క్రీన్ పై చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. మ‌నిషి ఆలోచ‌నా విధానం ఎలా ఉంటుంది? అత‌నిని అభిమానించే వారు ఎలాంటి స‌హాయం చేస్తార‌నే విష‌యాల‌ను దర్శకుడు కొత్త కోణంలో చూపించారు.

మిగ‌తా న‌టుల న‌ట‌న‌
ప్రకాశ్ రాజ్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్ కొత్త‌గా క‌నిపించారు. అలాగే రాశీఖ‌న్నా గ్లామ‌ర్‌తోనే కాకుండా, డైలాగులతోనూ అద‌ర‌గొట్టారు. మాళ‌వికా నాయ‌ర్‌, అవికా గోర్ పాత్ర‌లు చిన్న‌వే అయినా సినిమాకు ప్ల‌స్ అయ్యాయి.

ప్ల‌స్ పాయింట్స్
నాగ‌చైత‌న్య న‌ట‌న‌
రాశీఖ‌న్నా న‌ట‌న‌
డైరెక్ష‌న్

మైన‌స్ పాయింట్స్
కామెడీ
ఎమోషన్స్

'థ్యాంక్యూ' సినిమా చేయ‌డం త‌న అదృష్ణం అని నాగ‌చైత‌న్య (Naga Chaitanya) అంటున్నారు. ఇక ప్రేక్ష‌కులు నాగ‌చైత‌న్యకు  ఎలాంటి హిట్ అందిస్తారో వేచి చూడాలి. 

Read More:  అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) 'థాంక్యూ' సినిమా : టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలివే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!