విరాట పర్వం (Virata Parvam) ప్రీ రిలీజ్ వేడుకలో.. 'పోరాటంలో పుట్టిన వెన్నెల' వీడియో రిలీజ్ !
'విరాట పర్వం' (Virata Parvam) సినిమాపై రోజు రోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. కొన్ని గంటల్లో ఈ సినిమా విడుదల కానుంది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి నటించిన 'విరాటపర్వం' సినిమాను యువ దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించారు. తెలంగాణలోని నక్సలైట్ల ఉద్యమం ఆధారంగా 'విరాట పర్వం' చిత్రాన్ని రూపొందించారు. 'విరాట పర్వం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. వెన్నెల పుట్టుక అంటూ ఓ వీడియో సైతం రిలీజ్ చేశారు.
సాయి పల్లవి పాత్ర కీలకమా!
విప్లవకారిణి వెన్నెల పుట్టుకకు సహాయం చేసిన డాక్టర్ ఎవరు? ఆమె ఎందుకు హత్యకు గురైందన్న సస్పెన్స్ 'విరాట పర్వం'లో (Virata Parvam) కొనసాగనుంది. ఆ డాక్టర్‌ను నక్సలైట్లు హతమారుస్తారా, లేక పోలీసుల ప్రమేయం ఉందా? అన్న విషయం తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల‌్సిందే.
పోరాటంలో పుట్టిన వెన్నెల కథగా 'విరాట పర్వం' చిత్రం మొదలవుతుంది. ప్రజల మనసులలో విప్లవ బీజాలు నాటడం కోసం నక్సలైట్లు ఏం చేశారు. ఆ పోరాటం వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు ఏంటి?. వెన్నెల పాత్రను పోషించిన సాయి పల్లవి చుట్టూ కథ సాగనుందా? ఈ ప్రశ్నలకు సమాధానం మరి కొన్ని గంటల్లో తెలిసిపోనుంది.
నక్సలిజం నేపథ్యంలో సాగే 'విరాట పర్వం'
నక్సలిజం నేపథ్యంలో రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'విరాట పర్వం' (Virata Parvam). ఈ సినిమా జూన్ 17 న రిలీజ్ కానుంది. విప్లవ భావాలు కలిగిన అమ్మాయిగా సాయి పల్లవి ఈ చిత్రంలో కనిపించనున్నారు.
రానా దగ్గుబాటి, సాయి పల్లవి కలిసి నటించిన 'విరాట పర్వం' (Virata Parvam) రెండేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనాతో పాటు పెద్ద సినిమాల రిలీజ్‌తో ఈ సినిమా కాస్త వెనుకబడింది. 'విరాట పర్వం' చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ ఆ మధ్య వినిపించింది. కానీ థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు.
ఇప్పటి వరకూ చేయని ఓ వైవిధ్యమైన పాత్రను నటి సాయిపల్లవి (Virata Parvam) ఈ చిత్రంలో పోషించడం విశేషం. కామ్రడ్ సరళక్క జీవితం ఆధారంగా వెన్నెల పాత్రను చిత్రంలో తీర్చిదిద్దారు దర్శకుడు వేణు.