Virata Parvam : 'విరాట ప‌ర్వం'లో గ‌న్ ప‌ట్టుకోవ‌డం.. ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది : సాయిప‌ల్ల‌వి

Updated on Jun 08, 2022 07:22 PM IST
విప్ల‌వ భావాలు క‌లిగిన అమ్మాయిగా సాయి ప‌ల్ల‌వి విరాట ప‌ర్వం (Virata Parvam)  చిత్రంలో క‌నిపించ‌నున్నారు.
విప్ల‌వ భావాలు క‌లిగిన అమ్మాయిగా సాయి ప‌ల్ల‌వి విరాట ప‌ర్వం (Virata Parvam) చిత్రంలో క‌నిపించ‌నున్నారు.

సాయి పల్లవి (Sai Pallavi) .. 2009 లో ఈటీవీలో ప్రసారమైన 'ఢీ' అనే డ్యాన్స్ షో ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత తను నటించిన మలయాళ చిత్రం 'ప్రేమమ్'.. సాయి పల్లవికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత దక్షిణాదిలోని దాదాపు అన్ని భాషలలో.. ఈమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి.

ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి, పడిపడి లేచె మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ లాంటి చిత్రాలు, ఈమెకు తెలుగులో మంచి పేరు తీసుకొచ్చాయి.  ప్రస్తుతం ఈమె 'విరాట పర్వం' అనే చిత్రంలో నటిస్తోంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

టాలీవుడ్‌లో సాయిప‌ల్ల‌వి (Sai Pallavi) న‌ట‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. న‌ట‌న‌తోనే కాకుండా డాన్సుల‌తోనూ ఆమె మెప్పిస్తోంది. సాయి ప‌ల్ల‌వి స్టెప్పుల‌కు ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే.  విరాట‌ప‌ర్వంలోని కొన్ని పోరాట సన్నివేశాలలో, సాయిపల్లవి ఫైట్లు కూడా చేశారట. 

నక్సలిజం నేపథ్యంలో సాగే 'విరాట పర్వం'

న‌క్స‌లిజం నేప‌థ్యంలో రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం 'విరాట ప‌ర్వం' (Virata Parvam). ఈ సినిమా జూన్ 17 న రిలీజ్ కానుంది. విప్ల‌వ భావాలు క‌లిగిన అమ్మాయిగా సాయి ప‌ల్ల‌వి ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నారు.

రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి క‌లిసి న‌టించిన 'విరాట ప‌ర్వం' (Virata Parvam) రెండేళ్ల క్రిత‌మే షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనాతో పాటు పెద్ద సినిమాల రిలీజ్‌తో  ఈ సినిమా కాస్త వెనుక‌బ‌డింది. 'విరాట ప‌ర్వం' చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తార‌నే టాక్ ఆ మ‌ధ్య వినిపించింది. కానీ థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు. ఇక అప్ప‌టి నుంచి సోషల్ మీడియాలో, ఇదే సినిమాపై వరుసగా అప్ డేట్స్ వస్తున్నాయి. 

విప్ల‌వ భావాలు క‌లిగిన అమ్మాయిగా సాయి ప‌ల్ల‌వి విరాట ప‌ర్వం (Virata Parvam)  చిత్రంలో క‌నిపించ‌నున్నారు.

గ‌న్ సీన్స్ థ్రిల్లింగ్‌గా అనిపించాయి : సాయిప‌ల్ల‌వి
'విరాటపర్వం' చిత్రంలో సాయిప‌ల్ల‌వి పోషించే పాత్ర పేరు 'వెన్నెల' . న‌క్స‌లైట్ ర‌వ‌న్న (రానా)  ర‌చ‌న‌ల‌కు సాయిప‌ల్ల‌వి అభిమానిగా మారుతుంది. అత‌నిని ఎలాగైనా క‌లుసుకోవాల‌నుకుంటుంది. రానాను క‌లిశాక సాయిప‌ల్ల‌వి కూడా ఉద్య‌మం వైపు అడుగులు వేస్తుంది. ఇదీ టూకీగా ఈ సినిమా కథ.

ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి కొన్ని యాక్ష‌న్ సీన్స్‌లో న‌టించారు. తుపాకీ ప‌ట్టి మ‌రీ పోరాటం చేసే పాత్ర‌ను పోషించారు. తాను ఇప్ప‌టివ‌ర‌కు చేసిన సీన్స్‌, డాన్సులు ఓ ఎత్తైతే.. 'విరాట ప‌ర్వం' వేరే లెవ‌ల్ అని అంటున్నారు సాయిప‌ల్ల‌వి .

తుపాకీ ప‌ట్టుకుని నటించడం అనేది, ఓ కొత్త అనుభ‌వం అని తెలిపారు. ఇకపై కూడా, బ‌ల‌మైన క‌థ ఉండే సినిమాల‌లో తాను న‌టిస్తాన‌ని సాయిపల్లవి అన్నారు. మంచి క‌థ‌లను ప్రేక్ష‌కులు ఎల్లప్పుడూ ఆద‌రిస్తార‌న్నారు. 'విరాట ప‌ర్వం'లో పాట‌లు కూడా బాగున్నాయ‌ని ఆమె అన్నారు.

 

విప్ల‌వ భావాలు క‌లిగిన అమ్మాయిగా సాయి ప‌ల్ల‌వి విరాట ప‌ర్వం (Virata Parvam)  చిత్రంలో క‌నిపించ‌నున్నారు.

రానా వ్య‌క్తిత్వం చాలా గొప్ప‌ది - సాయిప‌ల్ల‌వి
రానా ద‌గ్గుబాటి చాలా మంచి వ్య‌క్త‌ని సాయిప‌ల్ల‌వి (Sai Pallavi) చెప్పారు. విరాట‌ప‌ర్వం (Virata Parvam)  ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌లో వ‌ర్షంలో త‌న‌కు గొడుగు ప‌ట్టార‌ని.. రానా వ్య‌క్తిత్వం ఏంటో ఈ సంఘ‌ట‌న‌తో అంద‌రికీ తెలిసింద‌ని ప్ర‌శంసించారు. హీరో ఇమేజ్‌ను రానా అసలు ప‌ట్టించుకోర‌న్నారు. సెట్‌లో కూడా అందరినీ, చాలా గౌర‌వంగా చూసుకుంటార‌న్నారు. అలాగే తాను షూటింగ్ పూర్తి చేసుకొని, తిరిగి ఇంటికి వెళ్లే వ‌ర‌కు కూడా, చాలా జాగ్ర‌త్త‌గా చూసుకుంటార‌ని సాయి ప‌ల్ల‌వి తెలిపారు.

Read More: విరాట ప‌ర్వం ట్రైల‌ర్ రిలీజ్‌ ఈవెంట్‌లో.. రానా గొప్ప మ‌న‌సు చూసి ఫిదా అవ్వాల్సిందే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!