Thalapathy Vijay : దళపతి విజయ్ కొత్త సినిమా ‘వారసుడు’.. టైటిల్ ప్రకటించిన మేకర్స్ !
దళపతి విజయ్ (Thalapathy Vijay) మొదటిసారి తెలుగు సినిమాలో నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. హీరోలను స్టైలిష్ లుక్‌లో చూపించడంలో డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమాలో విజయ్ సరికొత్త లుక్‌తో ఆకట్టుకోబోతున్నాడు.
తాజాగా విజయ్ సినిమాకు సంబంధించి, రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. విజయ్ లుక్‌లో వంశీ పైడిపల్లి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. క్లాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తూనే.. మాస్‌కు దగ్గరయ్యేలా పోస్టర్‌లో విజయ్ కనిపిస్తున్నారు. ఇక తెలుగులో ఈ చిత్రానికి ‘వారసుడు’ అనే టైటిల్‌ను ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ లుక్ చూస్తుంటే విజయ్‌కి తెలుగులో మంచి ఎంట్రీ ఉండబోతోందని అనిపిస్తోంది.
తమిళంలో ‘వరిసు’..
ప్రస్తుతం విజయ్ 'వారసుడు' సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాలో రష్మికా మందాన హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్ 22వ తేదీన విజయ్ పుట్టినరోజు కావడంతో, ఒక రోజు ముందుగానే దళపతి 66వ సినిమా టైటిల్‌ను ప్రకటించేసింది చిత్ర యూనిట్. 'వారసుడు' సినిమాకు తమిళంలో ‘వరిసు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ సినిమా ఫస్ట్ లుక్ బాగా వైరల్ అవుతోంది. 'వారసుడుగా తిరిగొస్తున్న బాస్' అంటూ విజయ్ (Thalapathy Vijay) ఫస్ట్ లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ సినిమాలో విజయ్ బిజినెస్‌మేన్‌గా కనిపించనున్నాడు. దళపతి విజయ్ తన బర్త్‌డే ట్రీట్ ఒకరోజు ముందే ఇవ్వడంతో, ఆయన ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో #HBDDearThalapathyVijay, #Thalapathy66FirstLook హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. తెలుగులో వారసుడు టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న 'వారసుడు' సినిమా 2023 ప్రారంభంలో విడుదల కానుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Read More : దళపతి విజయ్ (Thalapathy Vijay )తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది: చిత్ర యూనిట్