ద‌ళ‌ప‌తి విజ‌య్‌ (Thalapathy Vijay )తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం హ్యాపీగా ఉంది: చిత్ర యూనిట్

Updated on May 27, 2022 05:02 PM IST
పాన్ ఇండియా సినిమాగా ద‌ళ‌ప‌తి విజ‌య్ (Thalapathy Vijay ) 66 సినిమాను ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్నారు.
పాన్ ఇండియా సినిమాగా ద‌ళ‌ప‌తి విజ‌య్ (Thalapathy Vijay ) 66 సినిమాను ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్నారు.

త‌మిళ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్‌ (Thalapathy Vijay) కు తెలుగు రాష్ట్రాల్లోనే మంచి ఫాలోయింగ్ ఉంది. విజ‌య్ తెలుగు ప్రేక్ష‌కుల కోసం డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా విజ‌య్ 66 సినిమాను ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్నారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ ,బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

విజ‌య్ సినిమాకు సంబంధించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ఓ అప్‌డేట్ ప్ర‌క‌టించింది. విజ‌య్‌తో వంశీ పైడిప‌ల్లి 25 రోజుల పాటు షూటింగ్ జ‌రిపారు. విజ‌య్ 66 సినిమా కీల‌క షెడ్యూల్ పూర్త‌యింద‌ని ప్ర‌క‌టించారు. ముఖ్య‌మైన సీన్స్ షూటింగ్ కంప్లీట్ చేశార‌ట‌. త్వ‌ర‌లోనే మ‌రో షెడ్యూల్ ఉంటుంద‌ని పోస్ట్ చేశారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ సోష‌ల్ మీడియా అకౌంట్‌లో ఈ వివ‌రాలు తెలిపారు. విజ‌య్‌తో జ‌రిగిన షూటింగ్ త‌న‌కు గుర్తిండిపోతుంద‌ని ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి తెలిపారు.
 

ర‌ష్మిక మంద‌న (Rashmika Mandanna) విజ‌య్‌కు జోడిగా న‌టిస్తున్నారు

విజ‌య్ 66 (Vijay 66) షూటింగ్ సూప‌ర్‌గా జ‌రిగింద‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ అన్నారు. సంగీతానికి సంబంధించిన ప్ర‌తీ స‌న్నివేశాన్ని ఇష్టంగా చేశామ‌న్నారు. హీరో విజ‌య్‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం సంతోషం క‌లిగించింద‌న్నారు త‌మ‌న్.బీస్ట్ సినిమాతో విజ‌య్ భారీ ఫ్లాప్‌ను అందుకున్నారు. పాన్ ఇండియా సినిమా త‌న‌కు హిట్ తెచ్చిపెడుతుంద‌ని ఆశ ప‌డుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా అడుగులు వేస్తున్నారు. విజ‌య్ 66 చిత్రానికివంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్‌ప్లేను అందించారు. 

 

 

ర‌ష్మిక మంద‌న (Rashmika Mandanna) విజ‌య్‌కు జోడిగా న‌టిస్తున్నారు. ప్ర‌కాశ్ రాజ్ కీల‌క రోల్‌లో యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా ప్ర‌కాశ్ రాజ్ విజ‌య్‌తో క‌లిసి దిగిన ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. 'హాయ్ చ‌ల‌మ్స్ ... మ‌నం మ‌ళ్లీ నీ 66 సినిమాలో క‌లిశాం' అంటూ ప్ర‌కాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో ప్ర‌భు, శ‌ర‌త్ కుమార్, జ‌య‌సుధ‌,  శ్రీకాంత్, శ్యామ్, సంగీత‌లు న‌టిస్తున్నారు. మొద‌టి సారి విజ‌య్ తెలుగు సినిమాలో న‌టిస్తున్నారు.2023 సంక్రాతి సీజ‌న్‌లో విజ‌య్, వంశీ కాంబోలో సినిమా రిలీజ్ కానుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!