Vijay Vs Mahesh Babu : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, మహేష్ బాబు కాంబోలో సినిమా.. ఫ్యాన్స్‌కు పూనకాలే !

Updated on Jun 08, 2022 07:42 PM IST
హీరో విజయ్, మహేష్ బాబు (Actor Vijay, MaheshBabu)
హీరో విజయ్, మహేష్ బాబు (Actor Vijay, MaheshBabu)

టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్.. ఏదైతేనేం !  సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్ల ట్రెండ్ బాగా​ ఎక్కువైంది. దీనితో కొన్ని డ్రీమ్ కాంబినేషన్స్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతున్నాయి. 

భారీ బడ్జెట్ సినిమాల్లో అయితే,  సూపర్ స్టార్స్‌గా పేరొందిన వారు సైతం చిన్న చిన్న కామియో రోల్స్ చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులు ఆ థ్రిల్లింగ్ ఫీల్‌ను ఎంజాయ్ చేశారు. 

ఇక లేటెస్ట్‌గా రిలీజయిన 'విక్రమ్' (Vikram Movie) సినిమాలో కూడా.. లోక నాయకుడు కమల్ హాసన్, సూర్య, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి దిగ్గజ నటులను ఒకే తెరపై చూసి ఫ్యాన్స్ థ్రిల్ ఫీలయ్యారు.

ఒకరకంగా చెప్పాలంటే, ఇటీవలి కాలంలో సౌత్‌లో మల్టీస్టారర్ ట్రెండ్ బాగా ఎక్కువైపోయింది. ఇదే పరంపరలో త్వరలోనే మరో ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకే స్క్రీన్‌‌ను పంచుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే కాంబినేషన్ !

తమిళ స్టార్​ హీరో విజయ్‌ హీరోగా,  వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దిల్‌రాజు, శిరీష్‌, పరమ్‌ వి పొట్లూరి, పెరల్‌ వి పొట్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయిక.

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో సూపర్​స్టార్​ మహేశ్​ బాబు గెస్ట్​ రోల్​ చేయబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అటు తెలుగులో, ఇటు తమిళంలో ఈ ఇద్దరు హీరోలకు ఫుల్​ ఫాలోయింగ్​ ఉంది. 

ఈ వార్తలో నిజమెంత ?

అందుకే ఈ క్రేజీ కాంబోని సెట్​ చేసే పనిలో, దర్శకుడు వంశీ పైడిపల్లి ఉన్నారని టాక్. ఈ బజ్ ఇప్పుడు​ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే, అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో శరత్‌ కుమార్‌, ప్రభు, యోగిబాబు, ప్రకాష్‌ రాజ్‌ (Prakash Raj), శ్రీకాంత్‌, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

విజయ్ చివరి సినిమా 'బీస్ట్' (Beast Movie) బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ సినిమా రూ.100 కోట్ల వరకు వసూలు చేయడం విశేషం. విజయ్ చివరి సినిమా ఫ్లాప్ కావడంతో.. ఆయన నుంచి మరో సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే, ప్రస్తుతం విజయ్ చేస్తున్న తన 66వ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. అలాగే ఇందులో మహేష్ బాబు ఒక చిన్న కామియోలో కూడా కనిపిస్తారని తెలుస్తోంది. 

Read More: ఎన్టీఆర్ 31 (NTR 31) సినిమాకు ప్ర‌శాంత్ నీల్ ఆ టైటిల్ పెడితే ఇక‌ అభిమానుల‌కు పూన‌కాలే!

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!