The Life of Muthu: శింబు 'ముత్తు'(Simbu) తెలుగు వెర్షన్ ఆలస్యం.. కారణం ఏంటో తెలుసా!
The Life of Muthu: తమిళ స్టార్ నటుడు శింబు (Simbu) ‘మన్మధ’, ‘వల్లభ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 'ముత్తు' సినిమాతో మరోసారి వినోదం పంచేందుకు రెడీ అయ్యారు. శింబు నటించిన 'ముత్తు' సినిమా తమిళ వెర్షన్ సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. తెలుగులో మాత్రం ఇదే చిత్రం రెండు రోజులు ఆలస్యంగా రిలీజ్ అవుతుంది. ఈ రోజు 'ముత్తు' సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ వెల్లడించారు.
యువకుడి కథ
పల్లెటూరు నుంచి పట్నానికి వెళ్లిన యువకుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కథతో 'ముత్తు' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. తమిళంలో 'వెందు తణీంధదు కాడు' ఆనే టైటిల్‌తో సెప్టెంబర్ 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' పేరుతో తెలుగులో సెప్టెంబర్ 17న విడుదల కానున్న ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చారు.
డబ్బింగ్ ఆలస్యమైందట..
'ది లైఫ్ ఆఫ్ ముత్తు' (The Life of Muthu) సినిమా తమిళ్ వెర్షన్ ముందుగానే రిలీజ్ కానుంది. కానీ తెలుగులో మాత్రం రెండు రోజులు ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు అనువాదానికి సంబంధించిన పనులు పూర్తి కాకపోవడంతోనే ఆలస్యమైందని టాక్. వారం రోజుల క్రితమే తెలుగు డబ్బింగ్ టీమ్‌తో ఒప్పందం జరిగిందని సమాచారం. అయితే, చాలా తక్కువ టైమ్‌లో వారు డబ్బింగ్ పూర్తి చేయలేకపోయారట. దీంతో తెలుగులో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. తమిళ్ వెర్షన్‌కు మంచి రెస్పాన్స్ వస్తే, తెలుగులో కూడా శింబు (Simbu) హిట్ కొట్టినట్టే అంటున్నారు సినీ క్రిటిక్స్.