Vikrant Rona: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోకి కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) పాన్‌ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’..!

Updated on Sep 02, 2022 10:22 AM IST
డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో (Disney Plus Hotstar) సెప్టెంబర్ 16 నుంచి 'విక్రాంత్ రోణ' స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో (Disney Plus Hotstar) సెప్టెంబర్ 16 నుంచి 'విక్రాంత్ రోణ' స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) నటించిన లేటెస్ట్‌ పాన్‌ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’ (Vikrant Rona). అనూప్ భండారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం జూలై 28న విడుద‌లై జాతీయ స్థాయిలో ఘ‌న విజ‌యం సాధించింది. సుదీప్ కెరీర్‌లోనే హైయెస్ట్ క‌లెక్ష‌న్లు సాధించిన సినిమాగా ఈ చిత్రం నిలిచింది. అంతేకాకుండా విడుద‌లైన ప్ర‌తి భాషలో భారీ వ‌సూళ్ళ‌ను సాధించి డ‌బుల్ బ్లాక్ బాస్ట‌ర్‌గా నిలిచింది.

కేవలం రిలీజైన నాలుగు రోజుల్లోనే ‘విక్రాంత్ రోణ’ (Vikrant Rona) సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. ఫ‌స్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని ‘కేజీఎఫ్’ (KGF) త‌ర్వాత ఆ స్థాయిలో ఇండియాని షేక్ చేసిన క‌న్న‌డ‌ సినిమాగా ‘విక్రాంత్ రోణ’ నిలిచింది. దాదాపు రూ.95కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం ఫైన‌ల్‌గా రూ.250 కోట్ల‌కు పైగా కలెక్ష‌న్ల‌ను సాధించింది. 

కాగా.. ‘విక్రాంత్ రోణ’ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) నర్తించిన ప్ర‌త్యేక గీతం 'రారా రక్కమ్మ' అనే సాంగ్ సూపర్ సక్సెస్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే కన్నడ వెర్షన్‌ను సెప్టెంబరు 2వ తేదీన జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ ఓటీటీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.

తాజాగా ఈ సినిమా తెలుగు వర్షన్‌ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫాం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో (Disney Plus Hotstar) సెప్టెంబర్ 16 నుంచి 'విక్రాంత్ రోణ' స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక, ఈ సినిమాలో సుదీప్ ఓ పోలీస్ ఆఫీసర్‌గా చేసిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. నీతా అశోక్, నిరూప్ భండారి ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

Read More: Vikrant Rona 3D Trailer: ‘విక్రాంత్ రోణ’ 3D ట్రైలర్ సందర్భంగా హీరో సుదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!