Ponniyin Selvan 1: 'పొన్నియిన్ సెల్వన్ 1' ట్రైల‌ర్ కోసం ఏక‌మైన కోలీవుడ్.. చోళ రాజుల పాల‌న‌పై మ‌ణిర‌త్నం సినిమా

Updated on Sep 07, 2022 05:43 PM IST
పాన్ ఇండియా సినిమాగా 'పొన్నియిన్ సెల్వ‌న్ 1'  (Ponniyin Selvan 1) చిత్రాన్ని మ‌ణిర‌త్నం అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. 
పాన్ ఇండియా సినిమాగా 'పొన్నియిన్ సెల్వ‌న్ 1'  (Ponniyin Selvan 1) చిత్రాన్ని మ‌ణిర‌త్నం అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. 

త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం అత్యంత ప్ర‌తీష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం  'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1). ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మం త‌మిళ‌నాట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 'పొన్నియిన్ సెల్వ‌న్' సినిమా ట్రైల‌ర్ రిలీజ్‌కు ప‌లువురు సినీ ప్ర‌ముఖులను ఆహ్మానించారు మ‌ణిర‌త్నం. అంతేకాకుండా ఎంతో గ్రాండ్‌గా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ ఈ సినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ఏఆర్ రెహ‌మాన్, ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్ కూడా హాజ‌ర‌య్యారు. 

పాన్ ఇండియా సినిమాగా 'పొన్నియిన్ సెల్వ‌న్ 1'  (Ponniyin Selvan 1) చిత్రాన్ని మ‌ణిర‌త్నం అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. 

భారీ బ‌డ్జెట్ సినిమా

కోలీవుడ్‌లో మూడేళ్ల నుంచి భారీగా హిట్ సాధించిన సినిమాలు ఏవీ లేవు. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'విక్ర‌మ్' సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించ‌డంతో కోలీవుడ్‌లో జోష్ పెరిగింది. దీంతో ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం త‌న సినిమా స‌క్సెస్ సాధిస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు. పాన్ ఇండియా సినిమాగా 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' చిత్రాన్ని మ‌ణిర‌త్నం అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. 

పొన్నియిన్ సెల్వన్ 1 (Ponniyin Selvan 1) ట్రైలర్ రిలీజ్ వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ కార్య‌క్రమానికి ముఖ్య అతిథులుగా ర‌జినీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ హాజ‌ర‌య్యారు. వీరితో పాటు ఈ సినిమాలో న‌టించిన చియాన్ విక్ర‌మ్, ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్, త్రిష‌, కార్తీ, జయం రవి న‌టించారు. 

పాన్ ఇండియా సినిమాగా 'పొన్నియిన్ సెల్వ‌న్ 1'  (Ponniyin Selvan 1) చిత్రాన్ని మ‌ణిర‌త్నం అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. 

కార్తీ చుట్టూ తిరిగే క‌థ‌!

యువరాజు ఆదిత్య కరికాలన్ నుంచి చోళ రాజ్యానికి ఓ సందేశాన్ని అందించేందుకు వంతీయతేవన్ వెళ‌తారు. ఆ త‌రువాత జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఏంటి?. రాత్రికి రాత్రే యుద్ధాలు జ‌ర‌గ‌డం.. స‌ముద్రంలో ప్ర‌యాణిస్తున్న రాజుల‌పై దండ‌యాత్ర‌లు.. రాణుల ఆదేశాల‌తోనూ యుద్ధాలు జ‌ర‌గ‌డం వంటి స‌న్నివేశాల‌తో 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' ట్రైల‌ర్ సాగింది. ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తేనే మైండ్ బ్లాక్ అవుతోంది. ఇక సినిమా ఏ రేంజ్‌లో హిట్ అవ‌నుందో చూడాలి. 

పాన్ ఇండియా సినిమాగా 'పొన్నియిన్ సెల్వ‌న్ 1'  (Ponniyin Selvan 1) చిత్రాన్ని మ‌ణిర‌త్నం అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. 

ఏ పాత్ర‌లో ఎవ‌రు

ఆదిత్య కరికాలన్ రాజు పాత్ర‌లో చియాన్ విక్ర‌మ్ న‌టించారు. యోధ యువరాజు వల్లవరైయన్ వంతీయతేవన్ పాత్ర‌లో కార్తీ, రాణి నందినిగా ఐశ్వర్య రాయ్ న‌టించారు. చోళ యువరాణి కుందవై పిరత్తియార్ పాత్రలో త్రిష క‌నిపించారు. రాజ రాజ చోళగా పొన్నియన్ సెల్వన్ గౌరవం అందుకున్నారు. జయం రవి అరుల్మొళి వర్మన్ (పొన్నియన్ సెల్వన్) పాత్రను పోషించారు.

పాన్ ఇండియా సినిమాగా 'పొన్నియిన్ సెల్వ‌న్ 1'  (Ponniyin Selvan 1) చిత్రాన్ని మ‌ణిర‌త్నం అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. 

ఏక‌తాటిపైకి కోలీవుడ్  ప్ర‌ముఖులు

తెలుగులో 'బాహుబ‌లి', 'పుష్ప‌', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు ఇండియాలో చ‌రిత్ర సృష్టించాయి. గ‌తంలో త‌మిళ సినిమాలు తెలుగులో డ‌బ్ చేసి రిలీజ్ చేశారు. అలా రిలీజ్ చేసిన ఎన్నో సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచాయి. మూడేళ్లుగా త‌మిళ్ సినిమా రంగంలో భారీ విజ‌యం సాధించిన సినిమా రిలీజ్ కాలేదు. 'పొన్నియిన్ సెల్వ‌న్ 1'తో త‌మిళ సినీ రంగానికి పూర్వ వైభ‌వం తీసుకురావాల‌ని మ‌ణిర‌త్నం భావిస్తున్నారని స‌మాచారం. అందుకే కోలీవుడ్ అంతా ఏక‌మై 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' సినిమా ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యార‌ట‌. 

Read More : Ponniyin Selvan (పొన్నియిన్ సెల్వన్ 1) : ఈ రోజే టీజర్ రిలీజ్.. ఈ సినిమాకు సంబంధించిన టాప్ 10 విశేషాలు ఇవే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!