Rajinikanth ‘Baba’: డబ్బింగ్ పూర్తి చేసిన తలైవా.. ‘బాబా’ కౌంటింగ్ రీస్టార్ట్ అంటున్న తలైవా అభిమానులు..!

Updated on Nov 28, 2022 03:15 PM IST
రజినీకాంత్ (Rajinikanth) పుట్టిన రోజు డిసెంబర్ 12వ తేదీన ‘బాబా’ (Baba Movie) చిత్రాన్ని రీ–రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు
రజినీకాంత్ (Rajinikanth) పుట్టిన రోజు డిసెంబర్ 12వ తేదీన ‘బాబా’ (Baba Movie) చిత్రాన్ని రీ–రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు

సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటనకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తనదైన నటన, హావభావాలు, స్టైల్‌తో ఆయన కోట్లాది మంది హృదయాల్లో  చోటు సంపాదించారు. రజినీ డైలాగ్ డెలివరీ చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఆయన నటించిన చిత్రాలు పరాజయం పాలైనా.. అందులో తలైవా చెప్పిన సంభాషణలు మాత్రం అందరి నోళ్లలో నానుతూనే ఉంటాయి. ఇక ఆయన ఫైట్ సీన్స్‌కు థియేటర్లు షేక్ అవుతుంటాయి. 

రజినీకాంత్ కెరీర్‌లో ‘బాబా’ (Baba Movie) చిత్రం చాలా ప్రత్యేకమైంది. ఈ మూవీ విడుదలై ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘బాబా’ను రీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన సన్నాహాలను ప్రారంభించారు. అందులో భాగంగా ‘బాబా’ మూవీ ప్రింట్‌ను ఇప్పటి సాంకేతికతకు అనుగుణంగా డిజిటల్ మిక్సింగ్ చేసి అప్‌డేట్ చేశారు. ఈ సినిమాకు బాణీలు సమకూర్చిన ఏఆర్ రెహమాన్ కూడా ప్రివ్యూ వేసుకుని.. ఏయే మార్పులు చేస్తే బాగుంటుందో చూసి వాటిని సరిచేశారు. ఇక రజినీకాంత్ కూడా కొత్త ఎడిట్‌లో కొన్ని సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పడం విశేషం. 

కొత్త ఎడిట్‌కు రజినీ డబ్బింగ్ చెబుతున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోను చూసిన తలైవా ఫ్యాన్స్.. ‘బాబా’ కౌంటర్ రీస్టార్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే, ‘బాబా’ మూవీని తమిళనాడులోనే గాక ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లోనూ పలు థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి, తెలుగునాట కూడా రీ–రిలీజ్ చేస్తారేమో చూడాలి. 

కాగా, ‘బాబా’ చిత్రం 2002, ఆగస్టు 15వ తేదీన రిలీజైంది. ఇందులో రజినీ సరసన మనీషా కొయిరాల కథానాయికగా నటించారు. ఈ సినిమాకు తలైవానే కథతోపాటు స్క్రీన్ ప్లేను అందించారు. అంతేకాకుండా ‘బాబా’ను ఆయనే నిర్మించడం విశేషం. రజినీతో ‘బాషా’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను తెరకెక్కించిన దర్శకుడు సురేష్ కృష్ణనే.. ‘బాబా’కూ డైరెక్షన్ చేయడం గమనార్హం. 

Read more: "కృతి సనన్ (Kriti Sanon) మనసులో ఉన్న హీరో దీపికా పదుకొణెతో (Deepika Padukone) బిజీగా ఉన్నాడు": వరుణ్ ధావన్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!