సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajini Kanth) 'జైలర్' (Jailer) సినిమా ఆసక్తికర వార్త.. కీలక పాత్రలో కోలీవుడ్ హీరో?

Updated on Sep 02, 2022 05:38 PM IST
ప్రముఖ యంగ్ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) ఒక కీలక పాత్ర చేస్తున్నాడని ఆ మధ్య వార్తలు రాగా ఇప్పుడు మరో ఆసక్తికర బజ్ వినిపిస్తోంది.
ప్రముఖ యంగ్ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) ఒక కీలక పాత్ర చేస్తున్నాడని ఆ మధ్య వార్తలు రాగా ఇప్పుడు మరో ఆసక్తికర బజ్ వినిపిస్తోంది.

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajini Kanth) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరోకు టాలీవుడ్ లో మాత్రమే కాకుండా.. వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం రజినీ కాంత్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో “జైలర్” టైటిల్ తో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

'జైలర్' (Jailer) సినిమాలో తమన్నా, రమ్య కృష్ణ (Ramya Krishnan) కూడా నటిస్తున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ చేసారు. కాగా ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అయితే, ఇటీవలే ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ మాస్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ క్రేజ్ తెచ్చుకుంది.

ఇక, రజినీ కాంత్ (Rajini Kanth) సినిమా అంటే ముందు నుండే భారీ క్రేజ్ ఉంటుంది. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ సందడి మాములుగా ఉండదు. మరోవైపు.. ప్రస్తుతం రజినీ కాంత్ వరుస ఫ్లాప్స్ లో ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ అంతా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ సినిమా మొదలయినప్పటి నుంచి ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా మరొక వార్త నెట్టింట షేర్ అవుతోంది. ప్రముఖ యంగ్ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) ఒక కీలక పాత్ర చేస్తున్నాడని ఆ మధ్య బజ్ రాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బజ్ అయితే ఈ సినిమాపై వినిపిస్తోంది.

'జర్నీ', 'రాజా రాణి' ఫేమ్ హీరో జై (Hero Jai) ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నట్టుగా ఇప్పుడు కోలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి దీనిలో ఎంతవరకు నిజముందో చూడాలి. 

Read More: Tamannaah: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) జైలర్ (Jailer) సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మిల్కీ బ్యూటీ తమన్నా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!