Prince: శివ‌కార్తికేయ‌న్ (Sivakarthikeyan) న‌టిస్తున్న 'ప్రిన్స్' సినిమా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

Updated on Sep 01, 2022 07:17 PM IST
శివ‌కార్తికేయ‌న్‌  (Sivakarthikeyan) కు తెలుగులో న‌టిస్తున్న మొద‌టి చిత్రం 'ప్రిన్స్'. ఈ చిత్రంలో స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.
శివ‌కార్తికేయ‌న్‌ (Sivakarthikeyan) కు తెలుగులో న‌టిస్తున్న మొద‌టి చిత్రం 'ప్రిన్స్'. ఈ చిత్రంలో స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

Prince: కోలీవుడ్ స్టార్ హీరో శివ‌కార్తికేయ‌న్ (Sivakarthikeyan) న‌టిస్తున్న 20వ సినిమా 'ప్రిన్స్'. ఈ చిత్రానికి జాతిర‌త్నాలు ఫేం అనుదీప్ కేవీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంతో ఉక్రెయిన్ న‌టి మ‌రినా ర్యాబొశ‌ప్క టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ లిరిక‌ల్ సాంగ్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన పోస్ట‌ర్ 'ప్రిన్స్' సినిమాపై ఆస‌క్తి పెంచింది.  

టాలీవుడ్‌లోకి త‌మ‌ళ హీరో ఎంట్రీ
శివ‌కార్తికేయ‌న్‌కు తెలుగులో న‌టిస్తున్న మొద‌టి చిత్రం 'ప్రిన్స్' (Prince). ఈ చిత్రంలో స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం దీపావ‌ళి పండుగ‌కు రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఫ‌న్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు అనుదీప్ కేవీ చిత్రీక‌రిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ, సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్, శాంతి టాకీస్ బ్యాన‌ర్ల‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్మోహ‌న్ రావు, సురేశ్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

వీడియో సాంగ్ రిలీజ్
'ఇంగ్లాండ్ క్వీన్ .. నిన్ను ఇల్లా రమ్మన్నాను' లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను 'ప్రిన్స్' మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట‌ను త‌మ‌న్ స్వ‌ర ప‌రిచారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఈ పాట‌ను రామ్ మిర్యాల బృందం ఆలపించింది. ఈ పాటకు శోభి అందించిన కొరియోగ్రఫీ ఆక‌ట్టుకుంది. శివకార్తికేయ‌న్ న‌టించిన ప్రిన్స్ సినిమా అక్టోబ‌ర్ 21 తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

Read more: Dhanush-Aishwarya: ధనుష్-ఐశ్వర్య మళ్లీ కలిసిపోయారా..? విడాకుల తొలిసారి ఒకే ఫ్రేములో కనిపించిన జంట ఫొటో వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!