కోలీవుడ్ స్టార్ హీరో 'సూర్య 42' (Suriya 42) నుంచి తాజా అప్ డేట్.. తాజాగా షూటింగ్ ప్రారంభం!

Updated on Aug 24, 2022 06:13 PM IST
హీరో సూర్య, డైరెక్ట‌ర్ సిరుతై శివ (Siruthai Siva) కాంబినేషన్ లో తెర‌కెక్కుతున్న 'సూర్య 42' (Suriya 42) చెన్నైలో లాంఛ్ అయిన సంగ‌తి తెలిసిందే.
హీరో సూర్య, డైరెక్ట‌ర్ సిరుతై శివ (Siruthai Siva) కాంబినేషన్ లో తెర‌కెక్కుతున్న 'సూర్య 42' (Suriya 42) చెన్నైలో లాంఛ్ అయిన సంగ‌తి తెలిసిందే.

విభిన్నమైన సినిమాలు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య (Hero Suriya). ఈ హీరో ఇప్పటి వరకు నేరుగా ఒక తెలుగు మూవీ లో కూడా నటించలేదు. కానీ, తాను నటించిన అనేక డబ్బింగ్ సినిమాల ద్వారా ఈ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ ను సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ హీరో తన అభిమానుల‌కు గుడ్ న్యూస్ అందిస్తూ.. కొత్త సినిమా షూటింగ్ షురూ చేశారు. 

కాగా, ఇప్పటికే హీరో సూర్య, మాస్ డైరెక్ట‌ర్ సిరుతై శివ (Siruthai Siva) కాంబినేషన్ లో తెర‌కెక్కుతున్న 'సూర్య 42' (Suriya 42) సినిమా ఇటీవల చెన్నైలో గ్రాండ్‌గా లాంఛ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ నేడు చెన్నైలో మొద‌లైంది. తాజా అప్‌డేట్ ప్ర‌కారం చెన్నైలో 10 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రుగ‌నుంది. అనంత‌రం వ‌చ్చే నెల‌లో గోవా షెడ్యూల్ మొద‌లు కానుంది.

ఈ మూవీ లో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని (Disha Patani) హీరోయిన్ గా నటించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నారు. ఇక, ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఏకకాలంలో రూపొందించనున్నట్టు తెలుస్తుంది. 

కాగా, దర్శకుడు శివ అంతకుముందు రజనీకాంత్ (Rajinikanth) హీరోగా తెరకెక్కిన 'అన్నాత్తే' మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగులో 'పెద్దన్న' పేరుతో విడుదలయింది. తొలిసారి ఆయ‌న సూర్య‌తో సినిమా చేస్తున్నాడు. 

Read More: Hombale Films: సూర్య‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌ల‌తో మ‌ల్టీ సార‌ర్ సినిమా ! హోంబ‌లే ఫిలిమ్స్ ఐడియా అదుర్స్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!