Chandramukhi 2: కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ హీరోగా 'చంద్రముఖి 2'.. అధికారిక ప్రకటన వచ్చేసింది!

Updated on Jun 15, 2022 06:07 PM IST
చంద్రముఖి 2 (Chandramukhi 2 Launching)
చంద్రముఖి 2 (Chandramukhi 2 Launching)

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Superstar Rajinikanth), జ్యోతిక, నయన తార కలిసి నటించిన బ్లాక్‌ బస్టర్ హిట్‌ చిత్రం 'చంద్రముఖి'. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ స్టైల్‌కి మరో కొత్త నిర్వచనం చెబుతూ.. అప్పట్లో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం. కామెడీ, హార్రర్‌ కాంబినేషన్‌లో రూపొంచిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంతోగానో ఆకట్టుకుంది. 

దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ (Chandramukhi Sequel) వస్తే ఎంతో బాగుంటుందని సగటు ప్రేక్షకుడు కోరుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఈ ఆల్‌టైమ్‌ సూపర్‌ హిట్‌ మూవీకి సీక్వెల్‌ వస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే హీరో, హీరోయిన్లు ఎవరనే అంశంపై స్పష్టత రాలేదు. కానీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్‌ వార్త ఇండస్ట్రీలో హల్‌చల్‌ చేస్తోంది. 

ఈ క్రమంలోనే తాజాగా 'చంద్రముఖి-2' (Chandramukhi 2) సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ఈ మూవీని నిర్మిస్తోంది. హీరోగా రజనీకాంత్ స్థానంలో రాఘవ లారెన్స్ నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. 'ముని' (తెలుగులో కాంచన) సిరీస్‌తో హర్రర్, కామెడీలో దిట్టగా పేరు తెచ్చుకున్న లారెన్స్.. ఈ సినిమాలో మెయిన్ రోల్ ప్లే చేస్తుండడంతో సినీ ప్రియులు ఖుుషి అవుతున్నారు.

చంద్రముఖి సినిమాకు దర్శకత్వం వహించిన పి.వాసు (P Vasu) ఈ మూవీని కూడా డైరెక్ట్ చేయనున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో చంద్రముఖిలో అలరించిన వడివేలు.. పార్ట్‌-2లో మరోసారి అభిమానులను నవ్వించనున్నాడు. మేక‌ర్స్ ఈ ప్రాజెక్టును ప్ర‌క‌టిస్తూ..టైటిల్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఓ బంగ్లాలో బంగారు వ‌ర్ణంలో కొద్దిగా తెరిచి ఉంచిన పెద్ద తలుపులు పోస్ట‌ర్ బ్యాక్ డ్రాప్‌లో క‌నిపిస్తున్నాయి. 

కాగా.. పి.వాసు, విక్టరీ వెంకటేశ్ (Hero Venkatesh) కాంబినేషన్‌లో ఇదివరకే వచ్చిన 'నాగవల్లి' మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. అప్పట్లో ఈ సినిమా చంద్రముఖి మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో పి.వాసు పక్కా స్క్రిప్ట్ వర్క్‌తో చంద్రముఖి-2ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కాగా, ఈ సినిమాను తమిళంతోపాటు తెలుగులో రూపొందించే విషయంపై క్లారిటీ రాలేదు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!